టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ విడుదల; ధర రూ.44,000
టీవీఎస్ మోటార్ కంపెనీ మే 2014 నెలలో సరికొత్త 'టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్' (TVS Star City+)ను విడుదల చేయనున్నట్లు గడచిన ఏప్రిల్ నెలలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. మేము చెప్పినట్లుగానే, టీవీఎస్ మోటార్ కంపెనీ నేడు తమ కొత్త 'టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్' మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.
దేశీయ విపణిలో టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బైక్ ధర రూ.44,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. గడచిన ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో టీవీఎస్ తొలిసారిగా తమ 'టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్' బైక్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బైక్‌ను తమిళనాడులో హోసూర్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నారు.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

ప్రస్తుత టీవీఎస్ స్టార్ సిటీ ప్లాట్‌ఫామ్‌పై ఈ కొత్త టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్‌ను నిర్మిస్తున్నారు. ఇదివరకటి స్టార్ సిటీ కన్నా మరింత మెరుగైన డిజైన్‌తో ప్రీమియం ఫీల్‌నిచ్చేలా ఈ బైక్‌ను అప్‌గ్రేడ్ చేశారు.

రెగ్యులర్ స్టార్ సిటీ కన్నా స్టార్ సిటీ ప్లస్ డిజైన్ మరింత షార్ప్‌గా ఉంటుంది. ఇందులో చెప్పుకోదగిన కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్, మెకానికల్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి.

కొత్త ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్, రీడిజైన్డ్ హెడ్‌ల్యాంప్స్, క్నీ (మోకాలు) రెస్ట్స్‌తో కూడిన ఫ్యూయెల్ ట్యాంక్, విశాలమైన సీట్, కొత్త ఎగ్జాస్ట్ పైప్ డిజైన్, డ్యూయెల్ టోన్ మడ్‌గార్డ్ వంటి ఫీచర్లను ఇందులో జోడించారు.

టీవీఎస్ స్టార్ సిట్ ప్లస్‌లో కాస్మోటిక్ మార్పులతో పాటుగా యాంత్రికపరమైన మార్పులు కూడా ఉన్నాయి. ఇందులో వెనుక వైపు కొత్తగా 5-స్టెప్ అడ్జస్టబల్ సస్పెన్షన్‌ను జోడించారు. రెగ్యులర్ స్టార్ సిటీలో 2-స్టెప్ అడ్జస్టబల్ సస్పెన్షన్‌ను మాత్రమే అందిస్తున్నారు.

ఇక ఇంజన్ విషయానికి వస్తే.. ఇందులో 110సీసీ ఈకోథ్రస్ట్ డిఎల్ఐ ఇంజన్‌ను ఉపయోగించారు (రెగ్యులర్ స్టార్ సిటీలో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు).

ఈ ఇంజన్ గరిష్టంగా 7000 ఆర్‌పిఎమ్ వద్ద 8.3 హార్స్‌పవర్‌ల శక్తిని మరియు 5000 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరింత మెరుగైన మైలేజీనిచ్చేలా ఈ ఇంజన్‌ను రీఫైన్ చేశారు.

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది లీటరుకు 85 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

ఎలక్ట్రిక్ స్టార్ట్, సర్వీస్ రిమైండర్, డిజిటల్ స్పీడో మీటర్ విత్ ఈకోమీటర్ వంటి ఫీచర్లను ఈ కొత్త స్టార్ సిటీ ప్లస్ బైక్‌లో ఆఫర్ చేస్తున్నారు.

దేశీయ విపణిలో టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బైక్ ధర రూ.44,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.


Click it and Unblock the Notifications








