డిసెంబర్ 2014 నాటికి ఐదు కొత్త మోడళ్లు: టీవీఎస్
భారతదేశపు నాలుగో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ, చెన్నైకు టీవీఎస్ మోటార్ కంపెనీ దేశీయ విపణిలో తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని మరింత విస్తరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే డిసెంబర్ 2014 నాటికి భారత మార్కెట్లో 5 కొత్త మోడళ్లను ప్రవేశపెడతామని కంపెనీ పేర్కొంది.
ఈ ఐదు మోడళ్లలో ఇప్పటికే మూడు మోడళ్లు ఖరారయ్యాయి. ఇందులో ఒకటి అప్‌గ్రేడెడ్ టీవీఎస్ స్కూటీ పెప్ స్కూటర్ కాగా మరొకటి పురుష వినియోగదారు లక్ష్యంగా చేసుకొని కంపెనీ అభివృద్ధి పెద్ద వెర్షన్ టీవీవెగో ఆటోమేటిక్ స్కూటర్. ఇక మూడవ ఉత్పత్తి అప్‌గ్రేడెడ్ టీవీఎస్ స్టార్ సిటీ బడ్జెట్ మోటార్‌సైకిల్.
ఇప్పటికే పెద్ద వెర్షన్ టీవీఎస్ వెగో స్కూటర్ స్పై చిత్రాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ కొత్త వెగో స్కూటర్ను ప్రస్తుత వెగో స్కూటర్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేస్తున్నారు. మూడు ఉత్పుత్తులలో ముందుగా టీవీఎస్ వెగా మార్కెట్లోకి రావచ్చని సమాచారం. మిగిలిన రెండు ఉత్పత్తుల వివరాలు తెలియాల్సి ఉంది.

మా అంచనాను బట్టి ఈ రెండు ఉత్పత్తులు టీవీఎస్ విక్టర్, టీవీఎస్ క్యూబ్ అయి ఉండొచ్చని అంచనా. టీవీఎస్ మోటార్ కంపెనీ గతంలో ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ.. పాపులర్ విక్టర్ బ్రాండ్‌కు క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ మోడల్‌ను కొత్త స్టయిల్‌తో తిరిగి మార్కెట్లో ప్రవేశపెడతామని కంపెనీ పేర్కొంది. గడచిన సంవత్సరం జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించిన మొట్టమొదటి హైబ్రిడ్ స్కూటర్ (ఎలక్ట్రిక్ + పెట్రోల్ పవర్) 'క్యూబ్'ను కూడా వాణిజ్య పరంగా విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఇదే ఐదవ ఉత్పత్తి అయి ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








