ఆప్షనల్ డిస్క్ బ్రేక్‌తో టీవీఎస్ వెగో స్కూటర్ విడుదల

చెన్నైకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ దేశీయ విపణిలో అందిస్తున్న స్టయిలిష్ స్కూటర్ వెగోలో ఇప్పుడు సరికొత్త వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. టీవీఎస్ వెగో ఇప్పటి వరకూ డ్రమ్ బ్రేక్ ఆప్షన్‌తోనే లభ్యమవుతుండేది. కాగా, ఇప్పుడు ఇందులో ఆప్షనల్ డిస్క్ బ్రేక్‌తో కూడిన కొత్త వేరియంట్‌ను టీవీఎస్ విడుదల చేసింది.

ఈ కొత్త వేరియంట్ విడుదలతో, భారత స్కూటర్ మార్కెట్లో డిస్క్ బ్రేక్ ఆప్షన్‌తో లభ్యమవుతున్న రెండవ స్కూటర్‌గా టీవీఎస్ వెగో నిలిచింది. హోండా అందిస్తున్న తమ ఏవియేటర్ స్కూటర్‌లో ఇప్పటికే డిస్క్ బ్రేక్ ఆప్షన్‌ను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిదనదే. ఆప్షనల్ డిస్క్ బ్రేక్‌తో కూడిన టీవీఎస్ వెగో ధర రూ.49,243 (ఎక్స్-షోరూమ్, పూనే)గా ఉంది. స్టాండర్డ్ వేరియంట్‌తో పోల్చుకుంటే దీని ధర రూ.2,800 అధికంగా ఉంది.

సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం టీవీఎస్ వెగో స్కూటర్‌లో డిస్క్ బ్రేక్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ వేరియంట్‌లో డిజైన్ పరంగా కానీ, ఇంజన్ పరంగా కానీ ఎలాంటి మార్పులు లేవు. టీవీఎస్ వెగో స్కూటర్‌లో ఉపయోగించిన 109.77సీసీ, ఫోర్-స్ట్రోక్ ఇంజన్ గరిష్టంగా 8.1 పిఎస్‌ల శక్తిని, 8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

TVS Wego

More from DriveSpark

Article Published On: Friday, March 22, 2013, 11:05 [IST]
English summary
Chennai based TVS Motor Company have added disc brakes as an option on its scooter, Wego. The Wego with disc brake has been priced at Rs. 49,243 (ex-showroom, Pune).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+