భారత్‍లోకి యూఎమ్ గ్లోబల్ బైక్స్ ప్రవేశం ఖరారు!
హ్యార్లీ డేవిడ్‌సన్ కంపెనీ తర్వాత భారత మార్కెట్లో మరో అమెరికన్ టూవీలర్ కంపెనీ ప్రవేశించనుంది. భారత్‌లో మోటార్‌సైకిళ్ల మంచి గిరాకీ ఏర్పడుతున్న నేపథ్యంలో, ఈ సెగ్మెంట్లోని అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు ఫారిన్ బైక్ కంపెనీలు ఇండియాకు క్యూ కడుతున్నాయి.
ఈ జాబితాలోకి తాజాగా మియామీ దేశానికి చెందిన 'యూఎమ్ గ్లోబల్' (UM Global) అనే మోటార్‌సైకిల్ తయారీ కంపెనీ వచ్చి చేరనుంది. యూఎమ్ గ్లోబల్ తమ భారతీయ అనుబంద సంస్థ 'యూఎమ్ మోటార్‌సైకిల్స్' (UM Motorcycles) ద్వారా భారత ద్విచక్ర వాహన మార్కెట్లోకి ప్రవేశించనుంది.
అమెరికాకు చెందిన ఈ యూఎమ్ మోటార్‌సైకిల్స్ సంస్థ, భారత్‌లో ఇతర అమెరికన్ మోటార్‌సైకిల్ బ్రాండ్‌ల మాదిరిగా హై-పెర్ఫామెన్సన్, లగ్జరీ మోటార్‌సైకిళ్లను 100సీసీ వంటి బడ్జెట్ మోటార్‌సైకిళ్లను ఆఫర్ చేయనుంది. ఈ కంపెనీ ఆఫర్ చేసే అత్యధిక సీసీ కలిగిన బైక్ 250సీసీ ఇంజన్ కలిగినది.
యూఎమ్ మోటార్‌సైకిల్స్ సంస్థకు సంబంధించిన మరిన్ని వివరాలను, భారత్‌లో కంపెనీ ఆఫర్ చేయనున్న వివిధ ఉత్పత్తుల వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

అమెరికాకు చెందిన ఈ యూఎమ్ (యునైటెడ్ మోటార్స్) మోటార్‌సైకిల్ కంపెనీ ఢిల్లీలో తమ కార్పోరేట్ ఆఫీసును ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రారంభంలో భాగంగా, ఈ కంపెనీ భారత్‌లో నాలుగు మోడళ్లను ఆఫర్ చేయనుంది. వీటి ఇంజన్ సామర్థ్యాలు 125సీసీ నుంచి 250సీసీ రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.

తమ ఉత్పత్తులను సరసమైన ధరకే అందించేందుకు వీలుగా, వాటిని స్థానికంగానే ఉత్పత్తి చేసేందుకు గాను కంపెనీ భారత్‌లోనే ఓ తయారీ/అసెంబ్లింగ్ ప్లాంట్‌ను మరియు ఓ ఆర్ అండ్ డి కేంద్రాన్ని కూడా భారత్‌లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

భారత్‌లో సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్ కోసం యూఎమ్ గ్లోబల్ ఓ స్థానిక భాగస్వామి కోసం ఎదురుచూస్తోంది. సదరు కొత్త భారతీయ భాగస్వామితో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసుకోవటం ద్వారా భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తరించుకోవాలని కంపెనీ యోచిస్తోంది.

రెనెగేడ్ స్పోర్ట్
యూఎమ్ గ్లోబల్ తమ రెనెగేడ్ బ్రాండెడ్ మోటార్‌సైకిళ్లను ఇక్కడి మార్కెట్లో పరిచయం చేయనుంది. ఇందులో రెనెగేడ్ స్పోర్ట్ కూడా ఒకటి. ఇది 137.8సీసీ, 180.4సీసీ, 196.4సీసీ ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతుంది.
* 137.8 cc - (10.97 HP at 7900 rpm/10.53 Nm at 5600 rpm)
* 180.4 cc - (16.7 HP at 8600 rpm/13.68 Nm at 8000 rpm)
* 196.4 cc - (15.22 HP at 7500 rpm/14.67 Nm at 6400 rpm)

రెనెగేడ్ డ్యూటీ
లీజర్ మోటార్‌సైకిల్ స్టయిల్‌లో ఉండే ఈ రెనెగేడ్ డ్యూటీ కూడా మూడు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి :-
* 124 cc (10.79 HP at 8300 rpm/9.15 Nm at 6500 rpm)
* 124 cc (11.85 HP at 7773 rpm/9.81 Nm at 6657 rpm)
* 149 cc - (12.92 HP at 7630 rpm/11.32 Nm at 6360 rpm)

రెనెగేడ్ లిమిటెడ్
రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ స్టయిల్‌లో కనిపించే ఈ క్రూజర్ మోటార్‌సైకిల్ 'రెనెగేడ్ లిమిటెడ్' రెండు ఇంజన్ ఆప్షన్లలో (175సీసీ, 196సీసీ) లభ్యం కానుంది. ఇది 5-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది.

రెనెగేడ్ కమాండో
రెండవ ప్రపంచ యుద్ధం ఆర్మీ మోటార్‌సైకిల్ థీమ్‌లో ఉండే ఈ రెనెగేడ్ కమాండో ఇది వరకు చెప్పుకున్న మూడు మోటార్‌సైకిళ్ల కన్నా శక్తివంతమైనది. ఇందులో 223సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8000 ఆర్‌పిఎమ్ వద్ద 18 హెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 15.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

భారత్‌లో యూఎమ్ మోటార్‌సైకిళ్ల ఉత్పత్తి ఈ ఏడాది మధ్య భాగం నాటికి ప్రారంభం కావచ్చని, అలాగే ఈ బైక్‌ల అమ్మకాలు ఆగస్ట్-సెప్టెంబర్ 2014 నాటికి మొదలు కావచ్చని అంచనా. దేశీయ విపణిలో వీటి ధరలు రూ.75,000 నుంచి రూ.1,50,000 రేంజ్‌లో ఉండొచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications








