2015 మధ్య భాగం నాటికి భారత్‌లో యూఎమ్ మోటార్‌సైకిల్స్

By Ravi

అమెరికాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ యూఎమ్ మోటార్‌సైకిల్స్ భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. ఈ విషయానికి సంబంధించి కంపెనీ ఇప్పుడు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఉత్తరాఖాండ్‌కు చెందిన లోహియా ఆటో ద్వారా భారత్‌లోకి ప్రవేశించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

యూఎమ్ గ్లోబల్‌కు చెందిన భారతీయ అనుబంద సంస్థ 'యూఎమ్ మోటార్‌సైకిల్స్' (UM Motorcycles), లోహియా ఆటోతో 50-50 జాయింట్ వెంచర్ ద్వారా, ఇక్కడి మార్కెట్లో యూఎమ్ఎల్ బ్రాండ్‌గా కార్యకలాపాలు సాగించనుంది. లోహియా ఆటోకు ఉత్తరాఖాండ్‌లో ఓ ఉత్పత్తి కేంద్రం ఉంది. ఈ ప్లాంట్‌లో సాలీనా 1,00,000 యూనిట్లను ఉత్పత్తి చేయవచ్చు.

UM Motorcycles

ఈ జాయింట్ వెంచర్ ద్వారా యూఎమ్ మోటార్‌సైకిల్స్ భారత కస్టమర్ల కోసం కొత్త రేంజ్ ఉత్పత్తులను తయారు చేయనుంది. వచ్చే ఏడాది (2015) మధ్య భాగం నాటికి యూఎమ్ఎల్ దేశీయ మార్కెట్లో తమ ఉత్పత్తులను విడుదల చేయనుంది. యూఎమ్ మోటార్‌సైకిల్ ప్రోడక్ట్ రేంజ్‌లో 125సీసీ నుంచి 300సీసీ వరకూ వివిధ ఉత్పత్తులు ఉన్నాయి.

యూఎమ్ఎల్ భారత మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించిన మొదటి సంవత్సరంలోనే, దేశంలోని అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో 50 వరకూ డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. భారత మార్కెట్లో యూఎమ్ మోటార్‌సైకిల్స్ అందించనున్న ఉత్పత్తుల ధరలు రూ.75,000 నుంచి రూ.1.50 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, November 13, 2014, 16:52 [IST]
English summary
UM motorcycles has now confirmed that they will be partnering with Lohia Auto Industries. It is a 50-50 joint venture between the two and has been renamed as ‘UML'.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+