రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి రానున్న కొత్త 400సీసీ బైక్ పేరు హిమాలయన్!

By Ravi

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ప్రియులకు ఓ శుభవార్త. ఇప్పటి వరకూ బుల్లెట్, క్రూజర్, కెఫే రేసర్ స్టయిల్ మోటార్‌సైకిళ్లను ఆఫర్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇకపై అడ్వెంచర్ టూరర్ బైక్‌ను కూడా ఆఫర్ చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఓ కొత్త మోడల్ పేరును కూడా ట్రేడ్‌మార్క్ చేసుకుంది.

ట్రేడ్‌మార్క్ ఫైలింగ్ ప్రకారం, రాయల్ ఎన్‌ఫీల్డ్ 'హిమాలయన్' (Himalayan) అనే పేరును రిజిస్టర్ చేసుకుంది. భవిష్యత్తులో కంపెనీ నుంచి రానున్న మోటార్‌సైకిల్‌కు ఈ పేరును ఉపయోగించనున్నారు. ఈ మోటార్‌సైకిల్‌ను ప్రముఖ డిజైనర్ పీరే టెర్బ్లాంచ్ డిజైన్ చేయనున్నట్లు సమాచారం.

హిమాలయన్ పేరును బట్టి చూస్తుంటే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటు లాంగ్ రైడ్‌కు అలాగే అటు హిమాలయన్ ఘాట్స్ వంటి రోడ్లపై సవారీకి సైతం అనువుగా ఉండేలా ఓ అడ్వెంచర్ టూరింగ్ బైక్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇది అధిక రైడ్ హైట్, గ్రౌండ్ క్లియరెన్స్, పొడవాటి సస్పెన్షన్‌ను కలిగి ఉండనుంది.

Himalayan

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవల ప్రవేశపెట్టిన కెఫే రేసర్ మోటార్‌సైకిల్ డిజైన్ అనేక మంది మోటారిస్టులను ఆకట్టుకుంది. యూకే ఈ మోడల్‌కు మంచి క్రేజ్ ఏర్పడింది. కేఫే రేసర్ రాకతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్యూచర్ మోటార్‌సైకిళ్ల డిజైన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు డ్యుకాటికి చెందిన ప్రముఖ డిజైనర్ పీరే టెర్బ్లాంచ్ కూడా ఈ కంపెనీలో చేరడంతో కొత్త బైక్ డిజైన్‌పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

కాగా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ రిజిస్టర్ చేసుకున్న హిమాలయన్ మోటార్‌సైకిల్‌లో 400సీసీ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. అయితే, ఇది పూర్తిగా సరికొత్త ఇంజనా లేక ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న 350సీసీ ఇంజన్‌కు రీబోర్డ్ ఇంజనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‍‌‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Royal Enfield has applied to trademark the name 'Himalayan', suggesting a new adventure-tourer is in the works. It is reported that, the new Royal Enfield Himalayan motorcycle set to be dsigned by renowned designer Pierre Terblanche who joined Royal Enfield last year.
Story first published: Thursday, February 12, 2015, 10:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X