మార్చ్ 4, 2014వ తేదీన వెస్పా ఎస్ స్కూటర్ విడుదల

ఇటాలియన్ ఆటోమొబైల్ దిగ్గజం పియాజ్జియో, ఈ నెల ఆరంభంలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించిన సరికొత్త వెస్పా ఎస్ స్కూటర్‌ను మార్చ్ 4, 2014 వాణిజ్య పరంగా భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వెస్పా సిరీస్‌లో వస్తున్న ఈ స్పోర్టీ వెర్షన్ 125సీసీ స్కూటర్ 'వెస్పా ఎస్' స్కూటర్‌ను ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న ప్రీమియం స్కూటర్ 'వెస్పా విఎక్స్125'కు ఎగువన ప్రవేశపెట్టనున్నారు.

వెస్పా ఎస్ అంటే వెస్పా స్పోర్ట్ అని అర్థం. ఇదొక క్లాసిక్ డిజైన్ కలిగిన స్పోర్టీ వెస్పా స్కూటర్. చూడటానికి దీని బేసిక్ డిజైన్ ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న వెస్పా ఎల్ఎక్స్, వెస్పా విఎక్స్‌ల మాదిరిగానే ఉంటుంది. అయితే, కొద్దిపాటి కాస్మోటిక్ మార్పులు, ఫీచర్ల మార్పులను ఇందులో గమనించవచ్చు. ప్రస్తుతం భారత్‌లో వెస్పా అందిస్తున్న 125సీసీ ఇంజన్‌నే ఈ కొత్త వెస్పా ఎస్ స్కూటర్‌లోను ఉపయోగించనున్నారు.

మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

వెస్పా ఎస్ స్కూటర్ విడుదల

వెస్పా ఎస్ మోడల్ బేసిక్ డిజైన్ వెస్పా ఎల్స్ఎక్స్ 125 మాదిరిగానే ఉంటుంది. అయితే, దీనికి ముందువైపు పురాతన మోడళ్లలో కనిపించినట్లుగా దీర్ఘచతుస్రాకారపు హెడ్‌లైట్ ఉంటుంది.

వెస్పా ఎస్ స్కూటర్ విడుదల

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా గతంలో మోడళ్ల నుంచి స్ఫూర్తిపొంది డిజైన్ చేసినదే. ఇందులో అనలాగ్ స్పీడోమీటర్, ఫ్యూయెల్ గేజ్ మరియు డిజిటల్ క్లాక్ ఉంటాయి.

వెస్పా ఎస్ స్కూటర్ విడుదల

ఈ స్కూటర్‌కు ముందువైపు ఒక వైపు మాత్రమే ఉండే షాక్ అబ్జార్వర్ ఉంటుంది. ట్రేడ్ మార్క్ పొందిన వెస్పా మోనోకాక్ ఛాస్సిస్‌ను వెస్పా ఎస్ స్కూటర్‌లో ఉపయోగించారు.

వెస్పా ఎస్ స్కూటర్ విడుదల

వెస్పా విఎక్స్ 125 మాదిరిగానే ఈ వెస్పా ఎస్ స్కూటర్‌లో కూడా ముందువైపు డిస్క్ బ్రేక్‌ను ఆఫర్ చేస్తున్నారు.

వెస్పా ఎస్ స్కూటర్ విడుదల

దేశీయ విపణిలో వెస్పా ఎస్ ధర రూ.82,868 (ఆన్-రోడ్, ఢిల్లీ)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 27, 2014, 16:00 [IST]
English summary
Vespa S (Sport), showcased for the first time in India at the Auto Expo 2014 has been officially confirmed for launch on March 4th. The Vespa S will be the Italian two wheeler brand's second scooter in India and will be priced above the Vespa VX 125.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+