భారత మార్కెట్ కోసం వెస్పా ఎస్ స్కూటర్
ఇటాలియన్ ఆటో దిగ్గజం పియాజ్జియో భారత మార్కెట్ కోసం మరొక సరికొత్త స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దశాబ్ధాల అనంతరం తమ పురాతన స్కూటర్ బ్రాండ్ 'వెస్పా'ను తిరిగి భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన తర్వాత, ఇక్కడి మార్కెట్లో ఈ బ్రాండ్ మంచి సక్సెస్‌ను సాధించడంతో ఈ బ్రాండ్ క్రింద ప్రోడక్ట్ పోర్ట్‍ఫోలియోను విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందులో భాగంగానే, గ్లోబల్ మార్కెట్లలో వెస్పా అందిస్తున్న స్పోర్టీయర్ 'వెస్పా ఎస్' (Vespa S) స్కూటర్‌ను దేశీయ విపణిలో కూడా విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న వెస్పా ఎల్ఎక్స్, వెస్పా విఎక్స్‌లను మహిళలు ఎక్కువగా ఆదరిస్తున్న నేపథ్యంలో, ఈ కొత్త వెస్పా ఎస్ స్కూటర్‌ను ప్రత్యేకించి పురుషులను టార్గెట్‌గా చేసుకొని మార్కెట్లోకి తీసుకురానున్నారు.
వెస్పా ఎస్ అంటే వెస్పా స్పోర్ట్ అని అర్థం. ఈ స్కూటర్ కూడా స్పోర్టీయర్ లుక్‌ను, పెర్ఫామెన్స్‌ను కలిగి ఉండనుంది. దీని ధరను ఎల్ఎక్స్, విఎక్స్ మోడళ్ల రేంజ్‌లో నిర్ణయించే ఆస్కారం ఉంది. ఇదిలా ఉండగా, కంపెనీ తాజాగా ప్రవేశపెట్టిన హ్యాండ్ మేడ్ ప్రీమియం స్కూటర్ వెస్పా 946ను కూడా ఈ ఏడాది చివరి నాటికి భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు పియాజ్జియో ప్రకటించిన సంగతి తెలిసినదే.

వెస్పా ఎస్ మోడల్ బేసిక్ డిజైన్ వెస్పా ఎల్స్ఎక్స్ 125 మాదిరిగానే ఉంటుంది. అయితే, దీనికి ముందువైపు పురాతన మోడళ్లలో కనిపించినట్లుగా దీర్ఘచతుస్రాకారపు హెడ్‌లైట్ ఉంటుంది.

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా గతంలో మోడళ్ల నుంచి స్ఫూర్తిపొంది డిజైన్ చేసినదే. ఇందులో అనలాగ్ స్పీడోమీటర్, ఫ్యూయెల్ గేడ్ మరియు డిజిటల్ క్లాక్ ఉంటాయి.

ఇంజన్ విషయానికి వస్తే, ప్రస్తుతం భారత్‌లో కంపెనీ అందిస్తున్న 125సీసీ ఇంజన్‌నే ఈ కొత్త వెస్పా ఎస్ స్కూటర్‌లోను ఉపయోగించనున్నారు. అయితే, దీనిని స్వల్పంగా ట్యూనే చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నేటి ఆధునిక యువతను దృష్టిలో ఉంచుకొన పియాజ్జియో ఈ వెస్పా ఎస్ స్కూటర్‌ను అభివృద్ధి చేసింది.

ఈ స్కూటర్‌లో కూడా వెస్పా విఎక్స్ 125 మాదిరిగానే ముందువైపు డిస్క్ బ్రేక్‌ను కంపెనీ ఆఫర్ చేసే ఆస్కారం ఉంది.






Click it and Unblock the Notifications








