వెస్పా ఎస్ స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు
ఇటాలియన్ ఆటోమొబైల్ దిగ్గజం పియాజ్జియో భారత్‌లో తమ టూవీలర్ బ్రాండ్ వెస్పాను విస్తరించే దిశలో భాగంగా మరో సరికొత్త స్కూటర్‌ను దేశీయ విపణిలో విడుదల చేసింది. గడచిన ఫిబ్రవరి నెల జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో పియాజ్జియో ప్రదర్శించిన సరికొత్త 'వెస్పా ఎస్' (Vespa S) స్కూటర్‌ను నేడు (మార్చ్ 5, 2014) వాణిజ్య పరంగా భారత మార్కెట్లో విడుదల చేశారు.
వెస్పా సిరీస్‌లో వస్తున్న ఈ స్పోర్టీ వెర్షన్ 125సీసీ స్కూటర్ 'వెస్పా ఎస్'ను ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న ప్రీమియం స్కూటర్ 'వెస్పా విఎక్స్125'కు ఎగువన ప్రవేశపెట్టారు. వెస్పా ఎస్‌లో అంటే ఎస్ అంటే స్పోర్ట్ అని అర్థం. ఇదొక క్లాసిక్ డిజైన్ కలిగిన స్పోర్టీ వెస్పా స్కూటర్.
వెస్పా ఎస్ బేసిక్ చూడటానికి ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న వెస్పా ఎల్ఎక్స్, వెస్పా విఎక్స్ స్కూటర్ల మాదిరిగానే ఉంటుంది. అయితే, కొద్దిపాటి కాస్మోటిక్ మార్పులు, ఫీచర్ల మార్పులను ఇందులో గమనించవచ్చు. ప్రస్తుతం భారత్‌లో వెస్పా అందిస్తున్న 125సీసీ ఇంజన్‌నే ఈ కొత్త వెస్పా ఎస్ స్కూటర్‌లోను ఉపయోగించారు. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో వెస్పా ఎస్ స్కూటర్‌ను ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ చేతుల మీదుగా విడుదల చేశారు.

వెస్పా విఎక్స్ స్కూటర్‌లో ఉపయోగించిన ఇంజన్‌నే వెస్పా ఎస్ స్కూటర్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 10.06 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది సివిటి గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

వెస్పా ఎస్ మోడల్ బేసిక్ డిజైన్ వెస్పా ఎల్స్ఎక్స్ 125 మాదిరిగానే ఉంటుంది. అయితే, దీనికి ముందువైపు పురాతన మోడళ్లలో కనిపించినట్లుగా దీర్ఘచతుస్రాకారపు హెడ్‌లైట్ ఉంటుంది.

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా గతంలో మోడళ్ల నుంచి స్ఫూర్తిపొంది డిజైన్ చేసినదే. ఇందులో అనలాగ్ స్పీడోమీటర్, ఫ్యూయెల్ గేజ్ మరియు డిజిటల్ క్లాక్ ఉంటాయి.

ఈ స్కూటర్‌కు ముందువైపు ఒక వైపు మాత్రమే ఉండే షాక్ అబ్జార్వర్ ఉంటుంది. ట్రేడ్ మార్క్ పొందిన వెస్పా మోనోకాక్ ఛాస్సిస్‌ను వెస్పా ఎస్ స్కూటర్‌లో ఉపయోగించారు.

వెస్పా విఎక్స్ 125 మాదిరిగానే ఈ వెస్పా ఎస్ స్కూటర్‌లో కూడా ముందువైపు డిస్క్ బ్రేక్‌ను ఆఫర్ చేస్తున్నారు.

వాస్తవానికి వెస్పా విఎక్స్ కన్నా వెస్పా ఎస్ కొద్దిగా అడ్వాన్స్డ్ వెర్షన్ అని చెప్పవచ్చు. ఇది ఆరెంజ్, రెడ్, మ్యాట్ బ్లాక్, వైట్ మొదలైన కొత్త రంగులలో లభిస్తుంది.

దేశీయ విపణిలో వెస్పా ఎస్ ధర రూ.74,414 (ఎక్స్-షోరూమ్, పూనే)గా ఉంది. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ కలుపుకుంటే ఈ ధర సుమారు రూ.82,000 లను దాటిపోతుంది.

వెస్పా ఎస్ స్కూటర్ ధర వెస్పా విఎక్స్ 125 ధర కన్నా సుమారు రూ.4,500లు అధికంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








