నేటితో 67 ఏళ్లు పూర్తి చేసుకున్న వెస్పా స్కూటర్ బ్రాండ్

స్కూటర్ ప్రియులకు 'వెస్పా' బ్రాండ్ గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. భారత ద్విచక్ర వాహన మార్కెట్లో కొత్త ఒరవడులకు శ్రీకారం చుట్టిన ఈ ఇటాలియన్ స్కూటర్ బ్రాండ్ నేటితో 67 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 26, 1946లో కంపెనీ వ్యవస్థాపకులు ఎన్‌రికో పియాజ్జియో ఇటాలియన్ సెంట్రల్ పేటెంట్ ఆఫీస్‌లో విభిన్న మోటార్‌సైకిల్ మోడళ్లను తయారు చేసేందుకు తన పేటెంట్‌ను ఫైల్ చేశారు. అదే వెస్పా బ్రాండ్ పుట్టుకకు శ్రీకారం.

నాటి నుంచి నేటి వరకూ అనేక రకాల వెస్పా స్కూటర్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. పియాజ్జియో మొట్టమొదటిగా 'వెస్పా ఎమ్‌పి6' ప్రోటోటైప్‌ను సృష్టించారు. ఈ ప్రోటోటైప్ విభిన్న వెస్పా స్కూటర్లకు పునాదిగా నిలించిది. ఈ ప్రోటోటైప్‌ను కోరాడినో డిఅస్కానియో మరియు డ్రాఫ్ట్‌మ్యాన్ మారియో డిఎస్ట్‌లు డిజైన్ చేశారు. 1960లో ప్రాంతంలో వెస్పా స్కూటర్ల ఇండియాలోకి ప్రవేశించాయి.

దేశీయ ఆటో దిగ్గజం బజాజ్ ఆటో ఇటలీకు చెందిన పియాజ్జియో నుంచి లైసెన్సున పొంది, భారత్‌లో స్కూటర్ల ఉత్పత్తిని ప్రారంభిచింది. అయితే, పియాజ్జియోతో బజాజ్ ఆటో ఈ కాంట్రాక్ట్‌ను 1971లో రెన్యువల్ చేసుకోలేదు. దీంతో 1983లో వెస్పా స్వతహాగా ఇండియాలోకి ప్రవేశించి ఎల్ఎమ్ఎల్, పి-సిరీస్ స్కూటర్ల విక్రయాన్ని ప్రారంభించింది. కానీ 1999లో ఎల్ఎమ్ఎల్, వెస్పాల భాగస్వామ్యం ముగిసిపోయింది.

ప్రస్తుతం మన భారత మార్కెట్లో లభిస్తున్న మోడ్రన్ వెస్పా మోడల్ 'వెస్పా ఎల్ఎక్స్125'. మరి 1946 నుంచి ఇప్పటి వరకూ వెస్పా డిజైన్ చేసిన వివిధ స్కూటర్లపై ఓ కన్నేసొద్దాం రండి..!

నేటితో 67 ఏళ్లు పూర్తి చేసుకున్న వెస్పా స్కూటర్ బ్రాండ్

నేటితో 67 ఏళ్లు పూర్తి చేసుకున్న వెస్పా స్కూటర్ బ్రాండ్

స్కూటర్ ప్రియులకు 'వెస్పా' బ్రాండ్ గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. భారత ద్విచక్ర వాహన మార్కెట్లో కొత్త ఒరవడులకు శ్రీకారం చుట్టిన ఈ ఇటాలియన్ స్కూటర్ బ్రాండ్ నేటితో 67 ఏళ్లు పూర్తి చేసుకుంది. మరి 1946 నుంచి ఇప్పటి వరకూ వెస్పా డిజైన్ చేసిన వివిధ స్కూటర్లపై ఓ కన్నేసొద్దాం రండి..!

1945 ఎమ్‌పి6 ప్రోటోటైప్

1945 ఎమ్‌పి6 ప్రోటోటైప్

మొట్టమొదటి వెస్పా స్కూటర్ కాన్సెప్ట్ (ప్రొడక్షన్ వెర్షన్‌కు). ఈ కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని వెస్పా తమ తొలి స్కూటర్‌ను తయారు చేసింది.

1946 వెస్పా 98

1946 వెస్పా 98

ప్రొడక్షన్ వెర్షన్ వెస్పా స్కూటర్

1949 వెస్పా తొలి 125సీసీ స్కూటర్

1949 వెస్పా తొలి 125సీసీ స్కూటర్

1949లో వెస్పా తమ తొలి 125సీసీ స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసింది.

1950 - వెస్పా మోటార్‌స్పోర్ట్ కాన్సెప్ట్

1950 - వెస్పా మోటార్‌స్పోర్ట్ కాన్సెప్ట్

మోటార్‌స్పోర్ట్స్‌ను ప్రమోట్ చేసేందుకు గాను వెస్పా ఈ కాన్సెప్ట్ స్కూటర్‌ను డిజైన్ చేసింది.

1951 - వెస్పా 125 సీ గిరోని

1951 - వెస్పా 125 సీ గిరోని

పిలియన్ రైడర్ సీట్, ముందువైపు స్టెప్నీను ఏర్పాటు చేసిన 125సీసీ వెస్పా స్కూటర్. ఈ మోడల్ పేరు సీ గిరోని.

1951 సిల్యురో

1951 సిల్యురో

1951 సిల్యురో ప్రోటోటైప్ (కాన్సెప్ట్ స్కూటర్).

1956 వెస్పా 150 టిఏపి

1956 వెస్పా 150 టిఏపి

యుద్ధంలోని సైన్యం కోసం వెస్పా అభివృద్ధి చేసిన 150 టిఏపి స్కూటర్ ఇది.

1959 - వెస్పా 50 ఎలెస్టార్ట్

1959 - వెస్పా 50 ఎలెస్టార్ట్

ఎలక్ట్రిక్ స్టార్ట్ సిస్టమ్‌తో రూపొందించిన మొట్టమొదటి స్కూటర్ ఈ 1959 - వెస్పా 50 ఎలెస్టార్ట్.

1964 - వెస్పా 50

1964 - వెస్పా 50

1964 మోడల్ వెస్పా స్కూటర్

1965 - వెస్పా 180 ఎస్ఎస్

1965 - వెస్పా 180 ఎస్ఎస్

1965 మోడల్ వెస్పా స్కూటర్

1967 - వెస్పా ఆల్ఫా ప్రోటోటైప్

1967 - వెస్పా ఆల్ఫా ప్రోటోటైప్

హెలికాఫ్టర్ టైప్ కాన్సెప్ట్ స్కూటర్‌ను తయారు చేసిన వెస్పా

1968 - వెస్పా 125 ప్రైమావెరా

1968 - వెస్పా 125 ప్రైమావెరా

1968 మోడల్ వెస్పా స్కూటర్

1968 - వెస్పా 180 ర్యాలీ

1968 - వెస్పా 180 ర్యాలీ

1968 మోడల్ వెస్పా స్కూటర్

1976 - వెస్పా 125 ప్రైమావెరా ఈటి3

1976 - వెస్పా 125 ప్రైమావెరా ఈటి3

1976 మోడల్ వెస్పా స్కూటర్

1976 - వెస్పా ర్యాలీ 200

1976 - వెస్పా ర్యాలీ 200

1976 మోడల్ వెస్పా స్కూటర్

1977 - వెస్పా గిగాంటే

1977 - వెస్పా గిగాంటే

1977 మోడల్ వెస్పూ స్కూటర్

1978 - వెస్పా పి125ఎక్స్

1978 - వెస్పా పి125ఎక్స్

1978 మోడల్ వెస్పా స్కూటర్

ఎమ్‌పి5 (మోటో పియాజ్జియో 5)

ఎమ్‌పి5 (మోటో పియాజ్జియో 5)

మోటార్‌స్పోర్ట్స్ కోసం పియాజ్జియో తయారు చేసిన స్కూటర్

వెస్పా 150 జిఎల్

వెస్పా 150 జిఎల్

వెస్పా ఎల్ఎక్స్125

వెస్పా ఎల్ఎక్స్125

ప్రస్తుతం పియాజ్జియో దేశీయ విపణిలో అందిస్తున్న వెస్పా ఎల్ఎక్స్125 స్కూటర్.

More from DriveSpark

Article Published On: Friday, April 26, 2013, 11:34 [IST]
English summary
In two days time, on April 26th, 2013 Vespa will mark its 67th anniversary. It was on 26th April, 1946 that the company's founder Enrico Piaggio filed his patent for a different breed of motorcycle model at the Italian Central Patents Office. It was birth of the iconic Vespa.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+