స్టన్నింగ్ ప్రోటోటైప్ కెమెరాను ఆవిష్కరించిన వెస్పా
అదేంటి.. లైట్స్, కెమెరా, యాక్షన్ అని కదా చెప్పాలి.. చిత్రంగా లైట్స్, వెస్పా, యాక్షన్ అని చెబుతున్నారేంటి అనుకుంటున్నారా..? పియాజ్జియోకి చెందిన ఇటాలియన్ టూవీలర్ బ్రాండ్ 'వెస్పా' ఓ సరికొత్త ప్రోటోటైప్ కెమెరాను ప్రపంచానికి పరిచయం చేసింది.
ఇండస్ట్రియల్ డిజైన్ గురూస్‌గా పేరు గాంచిన రోటిమి సొలోలా మరియు కాయిట్ మిక్లాస్‌ల సహకారంతో వెస్పా ఓ సరికొత్త కెమెరా ప్రోటోటైప్‌ను అభివృద్ధి చేసింది. వెస్పా స్కూటర్ థీమ్‌తో ఉండే కెమెరాలో ఇటాలియన్ డిజైన్ లాంగ్వేజ్ స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ స్టయిలిష్ వెస్పా కెమెరాకు సంబంధించిన మరిన్ని ఫొటోలను వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

వెస్పా ఆవిష్కరించిన ఈ ప్రోటోటైప్ కెమెరా ఒక ఫుల్ ఫంక్షనింగ్ కెమెరా. రెగ్యులర్ డిడిటల్ కెమెరా మాదిరిగా ఇందులో హె రెజల్యూషన్ ఫొటోలను, వీడియోలను షూట్ చేయవచ్చు.

వెస్పా స్కూటర్ డిజైన్ మాదిరిగా ఉండే ఈ కెమెరా తొలిచూపులోనే ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ వెస్పా ప్రోటోటైప్ కెమెరా ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశం ఉంది.

ఇప్పటికే కెటిఎమ్, డ్యుకాటి, బిఎమ్‌డబ్ల్యూ, ఫెరారీ వంటి పలు ఆటోమొబైల్ కంపెనీల ఇతర బ్రాండ్‌లతో చేతులు కలిపి వివిధ మర్చైండ్‌లు, యాక్ససరీలను తయారు చేసి ఆఫర్ చేస్తున్నట్లుగానే, వెస్పా కూడా ఈ కెమెరాను ఆఫర్ చేయనుంది.

ఇటాలియన్ డిజైన్ అంటే ఇష్టపడే వారికి వెస్పా కెమెరా ఓ చక్కటి కానుకగా ఉంటుంది.

అయితే, ఈ వెస్పా కెమెరా అంత సరసమైన ధరకే లభిస్తుందనుకుంటే మాత్రం పొరపాటే. వెస్పా బ్రాండ్ ఇమేజ్‌కు తగినట్లుగానే దీని ధర కూడా ఉంటుంది.


Click it and Unblock the Notifications








