ప్రపంచంలో కెల్లా అత్యంత వేగమైన ఎలక్ట్రిక్ క్రూజర్
మన ఇదివరకటి కథనాల్లో విభిన్న ఎలక్ట్రిక్ బైక్‌ల గురించి తెలుసుకున్నాం. కానీ, ఇప్పుడు ఈ కథనంలో మనం తెలుసుకోబోయే ఎలక్ట్రిక్ బైక్ చాలా విశిష్టమైనది. ఈ ఎలక్ట్రిక్ బైక్ పేరు 'వాక్సన్ వాట్‌మ్యాన్' (Voxan Wattman). ఇదొక క్రూజర్ స్టైల్ బైక్.
ఆకర్షనీయమైన లుక్‌తో కనిపించే ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే ఎలక్ట్రిక్ క్రూజర్ బైక్. ఫ్రాన్స్‌కు చెందిన వాక్సన్ మోటార్స్ ఈ వాట్‌మ్యాట్ ఎలక్ట్రిక్ క్రూజర్‌ను తయారు చేసింది. ఆధునిక టెక్నాలజీకి ప్రతీకగా దీన్ని తయారు చేశారు.
ఇటీవల జరిగిన ప్యారిస్ మోటార్ షోలో వాక్సన్ మోటార్స్ ఈ వాట్‌మ్యాన్ బైక్‌ను ప్రదర్శనకు ఉంచింది. ప్రస్తుతం ఈ బైక్ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్ ప్రియులు ప్రధానంగా చర్చించుకుంటున్నారు. మరి ఇందులో అంత స్పెషల్ ఏముందో తెలుసుకుందాం రండి..!

వాక్సన్ మోటార్స్ తమ వాక్సన్ వాట్‌మ్యాన్ 'న్యూ ఫ్రెంచ్ రెవల్యూషన్' (కొత్త ఫ్రెంచ్ విప్లవం) అని పిలుస్తోంది. వాస్తవానికి ఈ వాట్‌మ్యాన్ ఎలక్ట్రిక్ బైక్‌లలో ఓ కొత్త విప్లవమే. ఈ బైక్ పూర్తిగా ఎలక్ట్రిక్ మెషీన్లతోనే నడుస్తుంది.

వాక్సన్ వాట్‌మ్యాన్ ఎలక్ట్రిక్ క్రూజర్‌ను పూర్తిగా స్క్రాచ్ నుంచి డెవలప్ చేశారు. దీని తయారీ కోసం ఎలాంటి ఇదవరకటి బైక్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించలేదు. దీని డిజైన్ వెనుక ప్రముఖ డిజైనర్ సచా లాకిక్ హస్తం ఉంది.

లిథియం బ్యాటరీల (12 కి.వా.) సాయంతో నడిచే ఈ బైక్ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 200 హార్స్ పవర్‌ల శక్తిని, 200 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

వాక్సన్ వాట్‌మ్యాన్ కేవలం 5.9 సెకండ్లలోనే 0-160 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 170 కిలోమీటర్లు.

సింగిల్ చార్జ్‌పై ఈ బ్యాటరీ పవర్‌తో 180 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, ఈ బ్యాటరీలు కూడా అత్యంత వేగంగా రీచార్జ్ అవుతాయి. ఇందులోని డిసి కాంబో 2 సాకెట్ ద్వారా కేవలం 30 నిమిషాల్లోనే 80 శాతం బ్యాటరీలు చార్జ్ అవుతాయి.

వాక్సన్ వాట్‌మ్యాన్ 2350 మి.మీ. పొడవును, 1015 మి.మీ. ఎత్తును, 815 మి.మీ. వెడల్పును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ 1705 మి.మీ. ఈ బైక్ మొత్తం బరువు 350 కేజీలు మాత్రమే.

వాక్సన్ వాట్‌మ్యాన్ ఎలక్ట్రిక్ క్రూజర్ బైక్‌ను మాస్ ప్రొడక్షన్ మాదిరిగా కాకుండా, ఆర్డర్ల మేరకు తయారు చేస్తారు. వీటిని పూర్తిగా చేతుల్తోనే అసెంబ్లింగ్ చేశ్తారు. ఫ్రాన్స్‌లోని సోలెస్మెస్ (సార్తే) ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్‌లో తయారు చేస్తారు.


Click it and Unblock the Notifications








