అన్ని పల్సర్‌లకు పెద్దన్న; బజాజ్ పల్సర్ 350సీసీ

By Ravi

బజాజ్ ఆటో నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న పల్సర్ బ్రాండ్‌లో ఓ పవర్‌ఫుల్ ఇంజన్ కలిగిన వేరియంట్ గురించి మన ఇదివరకటి కథనాల్లో చదువుకున్నాం. ఈ విషయంపై గతంలో ఒకానొక సందర్భంలో కంపెనీ వ్యాఖ్యానిస్తూ.. 2013లో శక్తివంతమైన ఇంజన్‌తో కూడిన బజాజ్ పల్సర్‌ను మార్కెట్లోకి తీసుకువస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, ఇందుకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని బజాజ్ ఆటో వెల్లడించకపోయినప్పటికీ, ఈ ఏడాది ఏప్రిల్ నెల నాటికి ఇది మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది.

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం బజాజ్ ఆటో ఓ 350సీసీ వేరియంట్ పల్సర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఏడాది మార్కెట్లో విడుదల కావల్సిన ఉన్న హోండా సిబిఆర్500, డ్యూక్ 390 స్పోర్ట్స్ బైక్‌లతో ఇది తలపడే అవకాశం ఉంది. గతంలో రాజీవ్ బజాజ్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ దృష్టంతా మోటార్‌సైకిళ్ల తయారీపైనే కేంద్రీకరించామని, ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటించేలా తమ కొత్త ఉత్పత్తులను తీర్చిదిద్దుతామని వ్యాఖ్యానించారు.

తాజా పరిణామాలను గమనిస్తుంటే, బజాజ్ పల్సర్ 350 త్వరలోనే మార్కెట్లో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ మేకర్ కెటిఎమ్‌తో బజాజ్ చేతులు కలిపిన తర్వాత తన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో మరిన్ని ఉత్పత్తులను అందించటం ద్వారా గ్లోబల్ బ్రాండ్‌గా ఎదగాలని కంపెనీ ఆశిస్తోంది. ఈ భాగస్వామ్యం తర్వాత బజాజ్ ఆటో డిజైన్, టెక్నాలజీ పరంగా అనేక విధాలుగా లాభపడినట్లుగా తెలుస్తోంది.

Pulsar

ప్రాధమిక సమాచారం ప్రకారం, బజాజ్ పల్సర్ 350లో గరిష్టంగా 40 బిహెచ్‌పిల శక్తిని, 30 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేసే 350సీసీ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం 7 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 165 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయనుంది. కొత్త బజాజ్ పల్సర్ 350లో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) కూడా అందుబాటులో ఉండొచ్చని అంచనా. దేశీయ విపణిలో దీని ధర రూ.1.75 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Thursday, January 31, 2013, 9:46 [IST]
English summary
Bajaj Auto is planning to launch 350cc versions of the Pulsar during the current calendar year. The Pulsar 350 is expected to be launched by April with a price tag of 1.75 lakhs (ex-showroom).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+