ఫెయిర్డ్ వెర్షన్ సుజుకి జిక్సర్ మోటార్‌సైకిల్ రానుందా?

By Ravi

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా, గడచిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో మార్కెట్లో విడుదల సరికొత్త 'సుజుకి జిక్సర్' (Suzuki Gixxer) 150సీసీ నేక్డ్ స్ట్రీట్ బైక్ అతికొద్ది సమయంలోనే అశేష ప్రజాదరణను సొంతం చేసుకుంది. సూపర్‌బైక్‌లను తలపించే విశిష్టమైన స్టయిలింగ్, ఆకర్షనీయమైన డిజైన్, సాటిలేని పెర్ఫార్మెన్స్‌లతో జిక్సర్ కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

తాజా అప్‌డేట్ ప్రకారం.. సుజుకి మోటార్‌సైకిల్ తమ జిక్సర్ బైక్‌లో ఓ ఫెయిర్డ్ వెర్షన్‌ను (యమహా ఎఫ్‌జెడ్, ఫేజర్ మోడళ్ల మాదిరిగా) విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మోడల్‌కు సంబంధించి కొన్ని రహస్య చిత్రాలు కూడా ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో ఫెయిర్డ్ వెర్షన్ మార్కెట్లోకి వచ్చినట్లయితే, ఇప్పటికే జోరుమీదున్న జిక్సర్ సేల్స్ మరింత జోరందుకునే ఆస్కారం ఉంది.

Gixxer

సుజుకి జిక్సర్ విషయానికి వస్తే.. ఇందులో 154.9సీసీ, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఎస్ఓహెచ్‌సి (సింగిల్ ఓవర్ హెడ్ కామ్‌షాఫ్ట్) పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 13.9 పిఎస్‌ల శక్తిని, 19.4 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇందులో ఎలక్ట్రిక్, కిక్ స్టార్ట్ ఆప్షన్స్ రెండూ ఉంటాయి.

సుజుకి జిక్సర్‌లో కొత్తగా 'సుజుకి ఈకో పెర్ఫామెన్స్' (ఎస్ఈపి) టెక్నాలజీని ఆఫర్ చేస్తున్నారు. సుజుకి అందిస్తున్న ఈ ఎస్ఈపి టెక్నాలజీ ఇప్పటికే హోండా అందిస్తున్న హోండా ఈకో టెక్నాలజీ (హెచ్ఈటి) మాదిరిగానే ఉంటుంది. ఈ టెక్నాలజీ ఇంజన్ మెకానికల్ లాసెస్‌ను తగ్గించి, పవర్ మరియు పెర్ఫామెన్స్‌ల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మెరుగైన మైలేజీనిచ్చేందుకు సహకరిస్తుంది.

సుజుకి జిక్సర్‌లో ముందువైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ను వెనుక వైపు మోనోషాక్, స్వింగ్ఆర్మ్ టైప్ సస్పెన్షన్‌ను ఆఫర్ చేస్తున్నారు. సుజుకి జిక్సర్‌లో ముందువైపు డిస్క్ బ్రేక్స్‌ను వెనుక వైపు డ్రమ్ బ్రేక్స్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఇది కాస్ట్ అల్లాయ్ వీల్స్‌తో లభిస్తుంది. దీని ఫ్రంట్ టైర్ సైజ్ 100/80-17, వెనుక టైరు సైజ్ 140/60-17. సుజుకి జిక్సర్ ఐదు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యం కానుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 17, 2015, 10:33 [IST]
English summary
Suzuki Motorcycle India Limited (SMIL) might launch a faired version of its new 155cc motorcycle Gixxer. Spy photos of a faired-in Suzuki Gixxer have surfaced on the internet.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+