భాగ్ మిల్కా భాగ్ చిత్రంలో బుల్లెట్ బైక్‌ను గెలుచుకోండి
‘ఫ్లయింగ్ సిక్కు'గా ప్రపంచానికి సుపరిచితుడైన ఓ స్టార్ అథ్లెట్ మిల్కా సింగ్ జీవిత కథను అధారంగా చేసుకుని యువ దర్శకుడు, నటుడు ఫర్హాన్ అక్తర్, స్టార్ డెరైక్టర్ రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా కాంబినేషన్‌లో వచ్చిన ‘భాగ్ మిల్కా భాగ్' బాలీవుడ్ చిత్రం సూపర్ డూపర్ హిట్ దర్శక నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా హిట్ కావటంతో, కొన్ని కంపెనీలకు తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకునేందుకు చక్కటి అవకాశం లభించింది.
ఇండియన్ హ్యార్లీ డేవిడ్‌సన్‌గా చెప్పుకునే రాయల్ ఎన్‌ఫీల్డ్ అదే పని చేసింది. భాగ్ మిల్కా భాగ్ చిత్రంలో మిల్కా సింగ్ పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ ఓ రాయల్ ఎన్‌ఫీల్డ్ డెసెర్ట్ స్టోర్మ్ 500సీసీ మోటార్‌సైకిల్ నడుపుతూ కనిపిస్తాడు. ఈ నేపథ్యంలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ అలాంటి ఓ బైక్‌ను గెలుచుకునే అవకాశాన్ని ప్రజలకు కల్పిస్తోంది. 2 లెజెండ్స్ 1 ఒడిస్సీ (2 Legends 1 Odyssey) అనే పేరుతో కంపెనీ ఓ కాంటెస్ట్‌ను నిర్వహిస్తోంది.
ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే సభ్యులు ఈ సినిమాలో మిల్కా సింగ్ తమ జీవితంలో పోషించిన "పట్టుదల, అభిరుచి మరియు త్యాగాల"ను తెలిపే తమ స్వంత కథను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉత్తమ కథ పోస్ట్ చేసిన వారిని రాయల్ ఎన్‌ఫీల్డ్ డెసెర్ట్ స్టోర్మ్ 500సీసీ మోటార్‌సైకిల్ వరిస్తుంది. మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

భాగ్ మిల్కా భాక్ స్టోరీ
దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌లో కుటుంబాన్ని కోల్పోయిన మిల్కా సింగ్ అనే పిల్లవాడు ప్రాణాలను రక్షించుకోవడానికి ఢిల్లీకి చేరుకుని, ఆ తర్వాత సైన్యంలో జవాన్‌గా చేరి ఓ సూపర్ స్టార్ అథ్లెట్‌గా ఎలా మారుతాడు? అతని జీవితంలో చోటుచేసుకున్న ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కొంటాడు? అనేక ఒడిదుడుకుల మధ్య తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా లేదా అనేది వెండితెర మీద చూడాల్సిందే.

రాయల్ ఎన్‌ఫీల్డ్ డెసెర్ట్ స్టోర్మ్ ఫీచర్లు
ఇందులో వెడల్పాటి టైర్లు, హెడ్‌లైట్ కేసింగ్ (టైగర్ ఐ ల్యాంప్), సరికొత్త స్పీడోమీటర్, పాత రోజులను తలపించే ఇంధన ట్యాంక్ డిజైన్, క్లాసిక్ డిజైన్ టూల్‌బాక్స్, విలాసవంతమై మరియు సౌకర్యవంతమైన రైడింగ్ కోసం ఏర్పాటు చేసిన విశిష్టమైన సింగిల్ శాడల్ స్ప్రింగ్ సీట్ 1950 లుక్ వచ్చేలా డిజైన్ చేసిన సైలెన్సర్, క్లాసిక్ డిజైన్ కలిగిన వెనుక మడ్‌గార్డ్ మరియు వింటేజ్ లుక్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెయిల్ ల్యాంప్‌కు ఈ మోటార్‌సైకిల్ యొక్క అధనపు ప్రత్యేకతలు.

సాంకేతిక వివరాలు:
ఇంజన్ టైప్ - సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ట్విన్‌స్పార్క్
ఇంజన్ సామర్థ్యం - 499cc
బోర్ x స్ట్రోక్ - 84 ఎమ్ఎమ్ x 90 ఎమ్ఎమ్
కంప్రెషన్ రేషియ - 8.5 : 1
గరిష్ట శక్తి - 27.2 బిహెచ్‌పి @ 5250 ఆర్‌పిఎమ్
గరిష్ట టార్క్ - 41.3 ఎన్ఎమ్ @ 4000 ఆర్‌పిఎమ్
ఇగ్నిషన్ సిస్టమ్ - డిజిటల్ ఎలక్ట్రానిక్ ఇగ్నిషన్
క్లచ్ - వెట్, మల్టీ-ప్లేట్
గేర్‌బాక్స - 5 స్పీడ్ కాన్‌స్టాంట్ మెష్
లూబ్రికెంట్ - వెట్ సంప్
ఇంజన్ ఆయిల - 5 W 50 API, SL Grade JASO MA
ఫ్యూయెల్ సప్లయ్ - కీహిన్ ఎలక్ట్రానిక్ ఫ్యూయెల్ ఇంజక్షన్
ఎయిర్ క్లీనర్ - పేరపర్ ఎలిమెంట్
ఇంజన్ స్టార్ట్ - ఎలక్ట్రిక్ / కిక్

ఛాస్సిస్, సస్పెన్షన్, బ్రేకులు, టైర్లు:
టైప్ - సింగిల్, డౌన్‌ట్యూబ్
ముందు సస్పెన్షన్ - టెలిస్కోపిక్, 355 ఎమ్ఎమ్ ఫోర్క్స్, 130 ఎమ్ఎమ్ ట్రావెల్
వెనుక సస్పెన్షన్ - 5-స్టెప్ అడ్జస్టబల్ ప్రీలోడ్‌తో కూడిన ట్విన్ గ్యాస్ చార్జ్‌డ్ షాక్ అబ్జార్వర్స్, 80 ఎమ్ఎమ్ ట్రావెల్
ముందు టైర్ - 90/90 - 19
వెనుక టైర్ - 120/80 - 18
ముందు బ్రేక్ - 280 ఎమ్ఎమ్ డిస్క్, 2-పిస్టన్ కాలిపర్
వెనుక బ్రేక్ - 153 ఎమ్ఎమ్ డ్రమ్, సింగిల్ లీడ్ ఇంటర్నల్ ఎక్స్‌పాండిగ్

కొలతలు, ఎలక్ట్రికల్స్:
వీల్‌బేస్ - 1370 ఎమ్ఎమ్
గ్రౌండ్ క్లియరెన్స్ - 135 ఎమ్ఎమ్
పొడవు - 2180 ఎమ్ఎమ్
వెడల్పు - 800 ఎమ్ఎమ్
ఎత్తు - 1080 ఎమ్ఎమ్
బరువు - 187 కేజీలు (90 శాతం ఇంధనం, ఆయిల్‌తో కలిపి)
ఇంధన ట్యాంక్ సామర్థ్యం - 14.5 లీటర్లు
ఎలక్ట్రికల్ సిస్టమ్ - 12 volt - DC
బ్యాటరీ - 12 volt, 14 Ah
హెడ్ ల్యాంప్ - 60 W / 55 W, హ్యాలోజెన్


Click it and Unblock the Notifications








