ఇండియాకు రానున్న వరల్డ్ ఫాస్టెస్ట్ బైక్ 'వై2కె'
ఈ ఫోటోలో కనిపిస్తున్న బైక్‌ను చూడండి. ఇది ఆషామాషీ బైక్ కాదు. దీని పేరు 'ఎమ్‌టిటి వై2కె' (MTT Y2K). ఈ బైపర్‌బైక్ ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు పెట్టే 'బుగాటి వేరాన్' కారును సైతం ఓవర్‌టేక్ చేయగలదు. దీని వేగం రయ్‌మని దూసుకువెళ్లే ఫార్ములా వన్ కారు కన్నా మూడు రెట్లు అధికం. దీని ముందు సుజుకి హయబుసా సూపర్‌బైక్ సైతం హీరో స్ప్లెండర్‌లా అనిపిస్తుంది. సౌత్ లౌసియానాకు చెందిన మెరైన్ టర్బైన్ టెక్నాలజీస్ (ఎమ్‍టిటి) సంస్థ ఈ వై2కే హైపర్‌బైక్‌ను తయారు చేసింది.
రోల్స్ రాయిస్ అల్లిసన్ 250-సిరీస్ (హెలికాఫ్టర్) గ్యాస్ టర్బైన్ ఇంజన్ (ఈ ఇంజన్లు హెలికాఫ్టర్లలో ఉపయోగిస్తారు) కన్నా ఇది తక్కువైందేమి కాదు. ఎమ్‌టిటి తమ వై2కె హైపర్‌బైక్‌ను తొలిసారిగా 2000 సంవత్సరంలో ఆవిష్కరించింది. ఇందులో అమర్చిన హెలికాఫ్టర్ ఇంజన్‌ను మోటార్‌సైకిల్‌కు సూట్ అయ్యేలా మోడిఫై చేశారు. ఈ ఇంజన్ గరిష్టంగా 320 హార్స్ పవర్‌ల గరిష్ట శక్తిని, 576 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. సుజుకి హయబుసా బరువు కన్నా వై2కె బరువు దాదాపు 30 కేజీలు తక్కువ.
ఇక దీని పెర్ఫామెన్స్ ఫిగర్స్ వింటే, మీరు గుండెల మీద చేతులు వేసుకోవటం ఖాయం. బుగాటి వేరాన్ 180 గంటకు కి.మీ. వేగాన్ని అందుకునేలోపే ఈ హైపర్‌బైక్ గరిష్టంగా గంటకు 320 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. అంటే, కేవలం 5.4 సెకండ్ల వ్యవధిలోనే ఇది 0-320 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఎమ్‌టిటి వై2కె హైపర్‌బైక్ గరిష్ట వేగం గంటకు 402 కి.మీ. ఈ స్పీడ్ కూడా చాలదనుకునే వారి కోసం ఎమ్‌టిటి ఇందులో 'వై2కె స్ట్రీట్‌ఫైటర్' అనే 420 బిహెచ్‌పి ఇంజన్ కలిగిన మరింత పవర్‍ఫుల్ హైపర్‌బైక్‌ను అభివృద్ధి చేసింది.
ఈ లేటెస్ట్ వెర్షన్ వై2కెలో రోల్స్ రాయిస్ 250 సి-20బి గ్యాస్ టర్బైన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 420 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 440 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. ఈ హైపర్‌బైక్ ఇండియాకు కూడా రావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాలో దీని ధర సుమారు కోటి రూపాయలకు పైగా ఉంది. అదే మనదేశంలో అయితే దీని అమెరికా ధర కన్నా రెట్టింపుగా (సుమారు రెండు కోట్ల రూపాయలు) ఉండొచ్చని అంచనా.
ఒకవేళ ఇలాంటి బైక్‌ను రోడ్లపై చూస్తే, కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే, ఓసారి ఇలానే ఈ బైక్ ఓ సిగ్నల్ వద్ద ఉండగా, వెనుకగా ఓ ఫెరారీ కారు వచ్చి ఆగింది. ఈ బైక్ సైలెన్సర్ నుంచి వచ్చే వేడి సదరు ఫెరారీ కారు ఫ్రంట్ బంపర్ కరిగి ముద్దై పోయింది. కాబట్టి జాగ్రత్త సుమా..!

ఎమ్‌టిటి వై2కె హైపర్‌బైక్
ఎమ్‌టిటి వై2కె(MTT Y2K) హైపర్‌బైక్ ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు పెట్టే 'బుగాటి వేరాన్' కారును సైతం ఓవర్‌టేక్ చేయగలదు. దీని వేగం రయ్‌మని దూసుకువెళ్లే ఫార్ములా వన్ కారు కన్నా మూడు రెట్లు అధికం. దీని ముందు సుజుకి హయబుసా సూపర్‌బైక్ సైతం హీరో స్ప్లెండర్‌లా అనిపిస్తుంది.

ఎమ్‌టిటి వై2కె హైపర్‌బైక్
సౌత్ లౌసియానాకు చెందిన మెరైన్ టర్బైన్ టెక్నాలజీస్ (ఎమ్‍టిటి) సంస్థ ఈ వై2కే హైపర్‌బైక్‌ను తయారు చేసింది.

ఎమ్‌టిటి వై2కె హైపర్‌బైక్
రోల్స్ రాయిస్ అల్లిసన్ 250-సిరీస్ (హెలికాఫ్టర్) గ్యాస్ టర్బైన్ ఇంజన్ (ఈ ఇంజన్లు హెలికాఫ్టర్లలో ఉపయోగిస్తారు) కన్నా ఇది తక్కువైందేమి కాదు. ఎమ్‌టిటి తమ వై2కె హైపర్‌బైక్‌ను తొలిసారిగా 2000 సంవత్సరంలో ఆవిష్కరించింది.

ఎమ్‌టిటి వై2కె హైపర్‌బైక్
ఇందులో అమర్చిన హెలికాఫ్టర్ ఇంజన్‌ను మోటార్‌సైకిల్‌కు సూట్ అయ్యేలా మోడిఫై చేశారు. ఈ ఇంజన్ గరిష్టంగా 320 హార్స్ పవర్‌ల గరిష్ట శక్తిని, 576 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. బుగాటి వేరాన్ 180 గంటకు కి.మీ. వేగాన్ని అందుకునేలోపే ఈ హైపర్‌బైక్ గరిష్టంగా గంటకు 320 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. అంటే, కేవలం 5.4 సెకండ్ల వ్యవధిలోనే ఇది 0-320 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఎమ్‌టిటి వై2కె హైపర్‌బైక్ గరిష్ట వేగం గంటకు 402 కి.మీ.

ఎమ్‌టిటి వై2కె హైపర్‌బైక్
ఈ స్పీడ్ కూడా చాలదనుకునే వారి కోసం ఎమ్‌టిటి ఇందులో 'వై2కె స్ట్రీట్‌ఫైటర్' అనే 420 బిహెచ్‌పి ఇంజన్ కలిగిన మరింత పవర్‍ఫుల్ హైపర్‌బైక్‌ను అభివృద్ధి చేసింది. ఈ లేటెస్ట్ వెర్షన్ వై2కెలో రోల్స్ రాయిస్ 250 సి-20బి గ్యాస్ టర్బైన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 420 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 440 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది.

ఎమ్‌టిటి వై2కె హైపర్‌బైక్
ఈ హైపర్‌బైక్ ఇండియాకు కూడా రావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాలో దీని ధర సుమారు కోటి రూపాయలకు పైగా ఉంది. అదే మనదేశంలో అయితే దీని అమెరికా ధర కన్నా రెట్టింపుగా (సుమారు రెండు కోట్ల రూపాయలు) ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








