హైదరాబాద్‌లో 'యమహా ఆల్ఫా' స్కూటర్ విడుదల

By Ravi

హైదరాబాద్: జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ యమహా మోటార్ ఇండియా, గడచిన ఫిబ్రవరిలో జరిగిన 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన సరికొత్త యమహా ఆల్ఫా (Yamaha Alpha) 110సీసీ స్కూటర్‌ను కంపెనీ ఇప్పుడు రాష్ట్ర మార్కెట్లో విడుదల చేసింది. రాష్ట్ర విపణిలో యమహా ఆల్ఫా స్కూటర్ ధర రూ.48,584 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా ఉంది.

యమహా ఆల్ఫా ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న రే, రే జెడ్ స్కూటర్ల మాదిరిగా కాకుండా హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ మోడళ్ల మాదిరిగా ఫ్యామిలీ డిజైన్‌ను కలిగి ఉంటుందియ ఈ స్కూటర్‌లో ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, 113సీసీ ఇంజన్‌ను ఉపయయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 7.1 పిఎస్‌ల శక్తిని, 5000 ఆర్‌పిఎమ్ వద్ద 8.1 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Yamaha Alpha 110cc Scooter Launched In Hyderabad

ఈ ఇంజన్ సివిటి (కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్) ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ స్కూటర్‌లో 21 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.2 లీటర్లు. ఇది లీటరుకు 62 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. దీని మొత్తం బరువు 104 కిలోలు. ఇది బ్లాక్, గ్రే, వైట్, రెడ్ మరియు మాగెంటా కలర్లలో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, March 5, 2014, 9:58 [IST]
English summary
Yamaha Motor India has launched its new automatic scooter Alpha in Hyderabad. Ymaaha Alpha has an air-cooled 4-stroke 113cc engine with continuous variable transmission that delivers smooth start-up acceleration and pick-up. The Alpha scooter is priced at Rs. 48,584 (ex-showroom, Hyderabad).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+