యమ జోరు మీదున్న యమహా ఆల్ఫా; 2 నెలల్లో 14000 స్కూటర్లు సేల్
యమహా తమ సరికొత్త ఆటోమేటిక్ స్కూటర్ 'ఆల్ఫా'ను గడచిన ఫిబ్రవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్ మందకొడిగా సాగుతున్నప్పటికీ, యమహా ఆల్ఫా కేవలం 2 నెలల వ్యవధిలోనే 14,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయి, కంపెనీ మరో సక్సెస్‌ఫుల్ స్కూటర్‌గా నిలిచింది.
దేశవ్యాప్తంగా చూసుకుంటే, యమహా అల్ఫా అమ్మకాలు ఎక్కువగా బెంగుళూరు నగరంలో నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ స్కూటర్‌కు మంచి స్పందన వస్తోందని, ప్రత్యేకించి బెంగుళూరు కస్టమర్ల నుంచి ఎక్కువ స్పందన లభిస్తోందని కంపెనీ పేర్కొంది. కేవలం బెంగుళూరులోనే ఇప్పటి వరకు 3500 ఆల్ఫా స్కూటర్లు అమ్ముడుపోయాయి.

యమహా ఆల్ఫా స్కూటర్ విషయానికి వస్తే, ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న రే, రే జెడ్ స్కూటర్ల మాదిరిగా కాకుండా ఇది హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ మోడళ్ల మాదిరిగా ఫ్యామిలీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్‌లో ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, 113సీసీ ఇంజన్‌ను ఉపయయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 7.1 పిఎస్‌ల శక్తిని, 5000 ఆర్‌పిఎమ్ వద్ద 8.1 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.



Click it and Unblock the Notifications








