అన్ని ద్విచక్ర వాహనాల ధరలను తగ్గించిన యమహా
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో కార్లు, మోటార్‌సైకిళ్లపై ఎక్సైజ్ సుంకాన్ని 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గించిన నేపథ్యంలో, ఈ ప్రయోజనాన్ని తమ కస్టమర్లపై బదిలీ చేసేందుకు యమహా సిద్ధమైంది. ఈ మేరకు కంపెనీ తమ ద్విచక్ర వాహనాల ధరలను తగ్గించనున్నట్లు ప్రకటించింది.
దేశవ్యాప్తంగా యమహా విక్రయిస్తున్న స్కూటర్లు, మోటార్‌సైకిళ్ల ధరలను వేరియంట్‌ను బట్టి రూ.1033 నుంచి రూ.3066 వరకు తగ్గిస్తున్నామని యమహా మోటార్ ఇండియా సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ధరల తగ్గుదల తక్షణమే అమల్లోకి వస్తుందని కంపెనీ వివరించింది.

ఈ సందర్భంగా, యమహా మోటార్ ఇండియా సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాయ్ కురియెన్ మాట్లాడుతూ.. ఆటో ఎక్స్‌పో తర్వాత మార్కెట్ సెంటిమెంట్ అధికంగా ఉన్న తరుణంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి వెలువడిన ఈ ప్రకటన ఎంతో ప్రయోజనకరంగా ఉందని, ఈ నిర్ణయం వలన పరిశ్రమ వృద్ధి కనబరచగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతం యమహా దేశీయ విపణిలో విమ్యాక్స్ (1,679cc), వైజెడ్ఎఫ్-ఆర్1 (998cc), ఎఫ్‌జెడ్1 (998cc), ఫేజర్ (153cc), ఎఫ్‌జెడ్-ఎస్ (153cc), ఎఫ్‌జెడ్ (153cc), ఎస్‌జెడ్-ఎక్స్, ఎస్‌జెడ్-ఆర్ & ఎస్‌జెడ్-ఆర్ఆర్ (153cc), వైజెడ్ఎఫ్-ఆర్15 వెర్షన్ 2.0 (150cc), ఎస్ఎస్125 (123cc), వైబిఆర్ 125 (123cc), వైబిఆర్ 110 (106cc), క్రక్స్ (106cc), రే (113cc), రే జెడ్ (113cc) మరియు ఆల్ఫా (113cc) స్కూటర్లను విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications








