ఈనెల 30వ తేదీన యమహా ఏం విడుదల చేయబోతోంది?
జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా ఈనెల 30వ తేదీన ఓ సరికొత్త ఉత్పత్తిని మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ మేరకు యమహా మీడియా ఆహ్వానాలు కూడా పంపింది. అయితే, ఆ ఈవెంట్‌కు సంబంధించిన వివరాలను మాత్రం కంపెనీ గోప్యంగా ఉంచింది.
మాకు అందిన అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, యమహా జూన్ 30వ తేదిన ఓ అప్‌డేటెడ్ ఎఫ్‌జెడ్-ఎస్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యమహా ఇలాంటి సర్‌ప్రైజ్ ఈవెంట్లను చాలా చక్కగా ప్లాన్ చేస్తుంది. అసలు విషయాన్ని చెప్పకుండా ఊరిస్తూ, ఆఖరి నిమిషంలో వివరాలను తెలియజేసి సర్‌ప్రైజ్ చేయం యమహా అలవాటు.
గతంలో కూడా ఇలానే యమహా సర్‌ప్రైజ్ తమ బ్రాండ్ మస్కట్‌ను విడుదల చేసింది. ఈసారి మాత్రం యమహా గడచిన ఆటో ఎక్స్‌పో 2014లో ప్రదర్శించిన కాన్సెప్ట్ వెర్షన్ ఎఫ్‌జెడ్-ఎస్ ఆధారంగా తయారు చేసిన ఓ సరికొత్త మోటార్‌సైకిల్‌ను మార్కెట్లో విడుదల చేయవచ్చని తెలుస్తోంది. కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎస్‌లో డిజైన్ పరంగా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది.

ఆటో ఎక్స్‌పో 2104లో కంపెనీ ఆవిష్కరించిన కాన్సెప్ట్ వెర్షన్ నుంచి స్ఫూర్తి పొంది దీనిని డిజైన్ చేయనున్నారు. ఇందులో సరికొత్త ఫ్యూయెల్ ట్యాంక్, ఎగ్జాస్ట్ (సైలెన్సర్), హెడ్‌లైట్, మడ్‌గార్డ్ డిజైన్లలో మార్పులు ఉండనున్నాయి. ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌లో కూడా మార్పు ఉండొచ్చని అంచనా. ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది.
ప్రస్తుత యమహా ఎఫ్‌జెడ్ సిరీస్ బైక్‌లలో ఉపయోగిస్తున్న 153సీసీ ఇంజన్‌నే ఈ కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎస్‌లోను ఉపయోగించే ఆస్కారం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 14 బిహెచ్‌పిల శక్తిని, 13.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








