యమహా ఫేజర్ ఎఫ్ఐ వెర్షన్ 2.0 విడుదల; ధర రూ.83,850

జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ 150సీసీ మోటార్‌సైకిల్ 'ఫేజర్'లో కంపెనీ ఓ సరికొత్త వెర్షన్‌ను నేడు (సెప్టెంబర్ 17, 2014) మార్కెట్లో విడుదల చేసింది. 'యమహా ఫేజర్ ఎఫ్ఐ వెర్షన్ 2.0' (Yamaha Fazer FI Version 2.0) పేరుతో మార్కెట్లో విడుదలైన ఈ కొత్త మోడల్‌లో కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా మెకానికల్ అప్‌గ్రేడ్స్ కూడా ఉన్నాయి.

కొత్త 2014 యమహా ఫేజర్ ఎఫ్ఐ వెర్షన్ 2.0 బైక్‌లో కొత్త తరం (న్యూ జనరేషన్) బ్లూ కోర్ ఇంజన్ కాన్సెప్ట్‌ను ఉపయోగించారు. ఈ కాన్సెప్ట్ వలన ఇంజన్ మరింత ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయటమే కాకుండా ఎక్కువ మైలేజీని కూడా ఆఫర్ చేస్తుంది. ఇదొక ఫ్యూయెల్ ఇంజెక్షన్ (ఎఫ్ఐ) సిస్టమ్ కలిగి ఇంజన్. దీని బాడీని కూడా కొత్తగా డిజైన్ చేశారు, ఇప్పుడు ఇది తేలిక బరువును కలిగి ఉంటుంది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

యమహా ఫేజర్ ఎఫ్ఐ వెర్షన్ 2.0

కొత్త తరం యమహా ఫేజర్ ఎఫ్ఐ వెర్షన్ 2.0 మోటార్‌సైకిల్‌లో కొత్తగా డిజైన్ చేసిన 149సీసీ, 4-స్ట్రోక్, ఎస్ఓహెచ్‌సి, సింగిల్ సిలిండర్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 8000 ఆర్‌పిఎమ్ వద్ద 13.1 పిఎస్‌ల శక్తిని, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 12.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బ్లూ కోర్ టెక్నాలజీతో ఈ ఇంజన్‌ను అభివృద్ధి చేశారు. దీని వలన ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ, యాక్సిలరేషన్ మెరుగుపడుతుంది. అంతేకాకుండా, ఈ టెక్నాలజీ వలన కొత్త ఫేజర్ మరింత పర్యావరణ సాన్నిహిత్యమైనదిగా మారుతుంది. ఈ బైక్‌ను 18-30 ఏళ్ల వయస్సు కలిగిన వారిని లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టారు.

యమహా ఫేజర్ ఎఫ్ఐ వెర్షన్ 2.0

కొత్త యమహా ఫేజర్ ఎఫ్ఐ వెర్షన్ 2.0లోని కీలక ఫీచర్లు:

1. క్లాస్ లీడింగ్ యాక్సిలరేషన్‌తో 14 శాతం అధిక మైలేజీని ఆఫర్ చేసే కొత్త ఇంజన్.

2. ఇంజన్ పెర్ఫార్మెన్స్‌ను పెంచేందుకు గాను ఫ్యూయెల్ ఇంజెక్షన్ మరియు లైట్ వెయిట్ (150సీసీ సెగ్మెంట్లో కెల్లా తేలికనైది).

3. మంచి రైడ్ కంఫఱ్ట్ కోసం కొత్తగా డిజైన్ చేసిన టాన్డెం సీట్, గ్రాబ్ బార్.

4. ఈకో ఇండికేటర్‌తో కూడిన మల్టీ-ఫంక్షన్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్.

5. కొత్త ఫ్రంట్ అండ్ రియర్ సస్పెన్షన్ సెట్టింగ్స్.

6. లైట్ వెయిట్ కోసం డిజైన్ చేసిన కొత్త ఛాస్సిస్.

7. మంచి హ్యాండ్లింగ్ కోసం కొత్త ఫ్రంట్ అండ్ రియర్ టైర్స్.

యమహా ఫేజర్ ఎఫ్ఐ వెర్షన్ 2.0

యమహా ఫేజర్ ఎఫ్ఐ వెర్షన్ 2.0 మోటార్‌సైకిల్‌ రెడ్ డాన్, బ్లాక్ హాక్ మరియు వైట్ క్లౌడ్ అనే మూడు రంగులలో లభిస్తుంది. దేశీయ విపణిలో దీని ధర రూ.83,850 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

యమహా ఫేజర్ ఎఫ్ఐ వెర్షన్ 2.0

ఈ ఫొటోలో మీరు చూస్తున్నది ఇదివరకు మార్కెట్లో ఉన్న పాత తరం యమహా ఫేజర్.

More from DriveSpark

Article Published On: Wednesday, September 17, 2014, 15:36 [IST]
English summary
Yamaha Motor India Sales Pvt. Ltd., today announced the launch of FAZER FI Version 2.0. The new FAZER FI Version 2.0 mounted with a newly designed air-cooled 149cc 4-stroke, SOHC, single-cylinder fuel-injected engine on a lightweight frame to realize the product concept of a “Sharpened & Power-packed New FZ.”
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+