యమహా ఎఫ్‌జెడ్ వెర్షన్ 2 విడుదల; ధర రూ.76,250
జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా ఈనెల 30వ తేదీన ఓ సరికొత్త ఉత్పత్తిని మార్కెట్లో విడుదల చేయనున్నట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, యమహా బైక్ ప్రియులందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఎఫ్‌జెడ్ సిరీస్‌లో రెండు సరికొత్త బైక్‌లను నేడు (30.06.2014వ తేదీన) విపణిలో విడుదల చేసింది. యమహా బ్రాండ్ అంబాసిడర్, ప్రముఖ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం చేతుల మీదుగా ఈ కొత్త బైక్‌లను మార్కెట్లో విడుదల చేశారు.
'యమహా ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ వెర్షన్ 2' (Yamaha FZ FI Version 2), 'యమహా ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ వెర్షన్ 2' (Yamaha FZ-S FI Version 2) పేర్లతో కంపెనీ ఫుల్లీ అప్‌గ్రేడెడ్ బైక్‌లను పరిచయం చేసింది. ఈ రెండు మోడళ్ల ధరలు, సాంకేతిక వివరాలు, మార్పులు చేర్పులకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ క్రింది స్లైడ్‌లలో తెలుసుకోండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

కొత్త యమహా ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ వెర్షన్ 2 బైక్‌లకు సంబంధించిన మరింత సమాచారాన్ని తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకోండి.

కొత్త యమహా ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ వెర్షన్ 2 సిరీస్ బైక్‌లలో కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా మెకానికల్ అప్‌గ్రేడ్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఇదివరకటి 153సీసీ ఇంజన్‌కు బదులుగా రీడిజైన్డ్ 149సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు.

పాత కార్బురేటర్ స్థానంలో కొత్త ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను ఈ ఇంజన్‌లో జోడించారు. ఇందులో ఉపయోగించిన కొత్త టెక్నాలజీని బ్లూ కోర్ అని పిలుస్తారు.

కొత్త యమహా ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ వెర్షన్ 2లో ఉపయోగించిన బ్లూ కోర్ టెక్నాలజీ, ఫ్యూయెల్ ఇంజక్షన్ సిస్టమ్‌ల వలన పవర్ లాస్ తగ్గి పెర్ఫార్మెన్స్ మరింత పెరగటంతో పాటుగా మైలేజ్ కూడా పెరుగుతుందని కంపెనీ వివరించింది.

పాత వెర్షన్‌తో పోల్చుకుంటే ఈ కొత్త వెర్షన్ దాదాపు 14 శాతం అధిక మైలేజీనిస్తుందని యమహా పేర్కొంది.

ఇందులో అమర్చిన రీడిజైన్డ్ 149సీసీ ఇంజన్ గరిష్టంగా 13.1 పిఎస్‌ల శక్తిని, 12.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో కొత్తగా ఈకో ఇండికేటర్‌తో కూడిన ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఉపయోగించారు.

ముందు, వెనుక సస్పెన్షన్ సిస్టమ్స్‌ను మార్చారు. బెటర్ రైడ్ ఎక్స్‌పీరియెన్స్ కోసం ఛాస్సిస్‌లో కూడా మార్పులు చేశారు. ముందు వెనుక కొత్త టైర్లను అమర్చారు. బైక్ డిజైన్‌లో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేశారు.

కొత్త యమహా ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ వెర్షన్ 2 మొత్తం బరువు 132 కేజీలు మాత్రమే (మునుపటి వెర్షన్ కన్నా 3 కేజీల బరువు తక్కువ). ఈ సెగ్మెంట్లో ఇదే తేలికైన 150సీసీ బైక్.

ప్రతి 6000 కి.మీ. ఒక్కసారి చొప్పున ఎఫ్ఐ (ఫ్యూయెల్ ఇంజెక్షన్)ను క్లీన్ చేసుకోవాల్సిందిగా యమహా సూచిస్తోంది.

18-30 ఏళ్ల వయస్సు కలిగిన యువతను టార్గెట్‌గా చేసుకొని ఈ బైక్‌ను ప్రవేశపెట్టామని, జులై 2014 నుంచి దీని డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.

దేశీయ విపణిలో ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ వెర్షన్ 2 ధర రూ.76,250లుగా ఉంటే, ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ వెర్షన్ 2 ధర రూ.78,250లుగా (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి.


Click it and Unblock the Notifications








