జాన్ అబ్రహాంకు స్పెషల్ ఎడిషన్ ఎఫ్‌జెడ్-ఎస్‌ని గిఫ్ట్ ఇచ్చిన యమహా
జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా ఇటీవలే భారత మార్కెట్లో తమ రిఫ్రెష్డ్ 'యమహా ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ వెర్షన్ 2' (Yamaha FZ FI Version 2), 'యమహా ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ వెర్షన్ 2' (Yamaha FZ-S FI Version 2) మోడళ్లను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. యమహా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం ఈ కొత్త బైక్‌లను మార్కెట్లో విడుదల చేశారు.
జాన్ అబ్రహామ్ ఎప్పటి నుంచో యమహా బ్రాండ్‌తో అసోసియేట్ అయి ఉన్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, యమహా మోటార్ ఇండియా తమ బ్రాండ్ అంబాసిడర్‌కు ఓ లేటెస్ట్ గిఫ్ట్‌ని ఇచ్చింది. యమహా విడుదల చేసిన రిఫ్రెష్డ్ ఎఫ్‌జెడ్-ఎస్ వెర్షన్ 2.0 మోడల్ ఆధారంగా చేసుకొని తయారు చేసిన ఓ స్పెషల్ ఎడిషన్‌ను కంపెనీ బాలీవుడ్ హీరోకి గిఫ్ట్‌గా ఇచ్చింది.
మరింత సమాచార తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో మరిన్ని వివరాలు తెలుసుకోండి.

జాన్ అబ్రహామ్ కోసం తయారు చేసిన స్పెషల్ ఎడిషన్ యమహా ఎఫ్‌జెడ్-ఎస్ వెర్షన్ 2.0లో కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఇది సరికొత్త బాడీ గ్రాఫిక్స్‌తో లభిస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్‌ను కేవలం జాన్ అబ్రహాం కోసం మాత్రమే చేశారు.

కొత్త యమహా ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ వెర్షన్ 2 సిరీస్ బైక్‌లలో కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా మెకానికల్ అప్‌గ్రేడ్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఇదివరకటి 153సీసీ ఇంజన్‌కు బదులుగా రీడిజైన్డ్ 149సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు.

పాత కార్బురేటర్ స్థానంలో కొత్త ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను ఈ ఇంజన్‌లో జోడించారు. ఇందులో ఉపయోగించిన కొత్త టెక్నాలజీని బ్లూ కోర్ అని పిలుస్తారు.

ఈ బ్లూ కోర్ టెక్నాలజీ, ఫ్యూయెల్ ఇంజక్షన్ సిస్టమ్‌ల వలన పవర్ లాస్ తగ్గి పెర్ఫార్మెన్స్ మరింత పెరగటంతో పాటుగా మైలేజ్ కూడా పెరుగుతుందని కంపెనీ వివరించింది. పాత వెర్షన్‌తో పోల్చుకుంటే ఈ కొత్త వెర్షన్ దాదాపు 14 శాతం అధిక మైలేజీనిస్తుందని యమహా పేర్కొంది.

ఇందులో అమర్చిన రీడిజైన్డ్ 149సీసీ ఇంజన్ గరిష్టంగా 13.1 పిఎస్‌ల శక్తిని, 12.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో కొత్తగా ఈకో ఇండికేటర్‌తో కూడిన ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఉపయోగించారు.

ముందు, వెనుక సస్పెన్షన్ సిస్టమ్స్‌ను మార్చారు. బెటర్ రైడ్ ఎక్స్‌పీరియెన్స్ కోసం ఛాస్సిస్‌లో కూడా మార్పులు చేశారు. ముందు వెనుక కొత్త టైర్లను అమర్చారు. బైక్ డిజైన్‌లో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేశారు.

కొత్త యమహా ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ వెర్షన్ 2 మొత్తం బరువు 132 కేజీలు మాత్రమే (మునుపటి వెర్షన్ కన్నా 3 కేజీల బరువు తక్కువ). ఈ సెగ్మెంట్లో ఇదే తేలికైన 150సీసీ బైక్.

ప్రతి 6000 కి.మీ. ఒక్కసారి చొప్పున ఎఫ్ఐ (ఫ్యూయెల్ ఇంజెక్షన్)ను క్లీన్ చేసుకోవాల్సిందిగా యమహా సూచిస్తోంది.

18-30 ఏళ్ల వయస్సు కలిగిన యువతను టార్గెట్‌గా చేసుకొని ఈ బైక్‌ను ప్రవేశపెట్టారు. దేశీయ విపణిలో ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ వెర్షన్ 2 ధర రూ.76,250లుగా ఉంటే, ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ వెర్షన్ 2 ధర రూ.78,250లుగా (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి.


Click it and Unblock the Notifications








