బాయ్స్ కోసం గర్ల్స్ స్కూటర్‌ను విడుదల చేసిన యమహా

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా ఇప్పుడు అబ్బాయిలను టార్గెట్‌గా చేసుకొని తమ కొత్త స్కూటర్‌ (అంత కొత్తదేం కాదులెండి)ను మార్కెట్లోకి విడుదల చేసింది. గతంలో యమహా భారతీయ మహిళలను టార్హెట్‌గా చేసుకొని మార్కెట్లో విడుదల చేసిన తమ మొట్టమొదటి స్కూటర్ యమహా రే (Yamaha Ray)కు జస్ట్ రంగు మార్చి యమహా రే జెడ్ (Yamaha Ray Z) అనే పేరుతో పురుషుల కోసం ఈ స్కూటర్‌ను దేశీయ విపణిలో ప్రవేశపెట్టింది.

యమహా రే స్కూటర్‌కు, రే జెడ్ స్కూటర్‌కు డిజైన్ పరంగా, ఇంజన్ పరంగా మరియు ఫీచర్ల పరంగా ఎలాంటి మార్పులు లేవు. మహిళల కోసం విడుదల చేసిన రే స్కూటర్‌కు కొత్త డ్యూయెల్ టోన్ పెయింట్‌ను జోడించి రే జెడ్ అనే పేరుతో పురుషుల కోసం దీనిని మార్కెట్లో విడుదల చేసింది. రేసింగ్ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన బాడీ గ్రాఫిక్స్, హైడ్‌లైట్‌‌కు పై భాగంలో బ్లాక్ కలర్ క్రింది భాగంలో వైట్ లేదా రెడ్ కలర్ కాంబినేషన్, చిన్న విండ్‌స్క్రీన్‌తో యమహా రే జెడ్ స్కూటర్ లభిస్తుంది.

భారత మార్కెట్లో యమహా రే జెడ్ స్కూటర్ ధర రూ.48,555/- (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. యమహా రే జెడ్ స్కూటర్‌లో ఉపయోగించిన 113సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎస్ఓహెచ్‌సి, 2-వాల్వ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 7. పిఎస్‌ల శక్తిని, 5000 ఆర్‌పిఎమ్ వద్ద8.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది లీటరుకు 53 కి.మీ. మైలేజీనిస్తుంది. యమహా రే జెడ్ స్కూటర్ కూడా రెండేళ్లు లేదా 24,000 కి.మీ. (ఏది ముందు మగిస్తే అది) వారంటీతో లభిస్తుంది.

యమహా రే జెడ్

యమహా రే జెడ్

యమహా రే జెడ్

యమహా రే జెడ్

యమహా రే జెడ్

యమహా రే జెడ్

యమహా రే జెడ్

యమహా రే జెడ్

యమహా రే జెడ్

యమహా రే జెడ్

యమహా రే జెడ్

యమహా రే జెడ్

యమహా రే జెడ్

యమహా రే జెడ్

యమహా రే

యమహా రే

యమహా రే

యమహా రే

యమహా రే

యమహా రే

More from DriveSpark

Article Published On: Friday, May 24, 2013, 16:12 [IST]
English summary
Yamaha Motor India launched the a new variant of its Ray automatic scooter at INR 48,555/- (Ex-showroom Delhi). This model is developed to target young male users in the age group of 16-22 years with its concept of “Aggressive Sporty Design.”
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+