యమహా ఎఫ్‌జెడ్-ఎస్ ఇప్పుడు 4 కొత్త రంగుల్లో లభ్యం

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ ఇండియా యమహా మోటార్ దేశీయ విపణిలో అందిస్తున్న 'యమహా ఎఫ్‌జెడ్-ఎస్'లో సరికొత్త కలర్లను ప్రవేశపెట్టింది. 2013 యమహా ఎఫ్‌జెడ్-ఎస్ బైక్ ఇప్పుడు ఫియర్‌లెస్ బ్లాక్, గ్లోరీ గోల్డ్, రేజింగ్ రెడ్, టెంపెస్ట్ బ్లూ అనే నాలుగు ఆకర్షనీయమైన రంగులలో లభ్యం కానుంది.

గడచిన సంవత్సరంలో యమహా తమ ఎఫ్‌జెడ్-ఎస్ బైక్‌ను అప్‌గ్రేడ్ చేసి, కొన్ని మార్పులు చేర్పులు చేసి, సరికొత్త పెయంట్ ఆప్షన్లతో మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, 2013 యమహా ఎఫ్‌జెడ్-ఎస్ బైక్‌లో యాంత్రికంగా కానీ, డిజన్ పరంగా కానీ ఎలాంటి మార్పులు లేవు.

యమహా ఎఫ్‌జెడ్-ఎస్ : కొత్త కలర్ ఆప్షన్స్

యమహా ఎఫ్‌జెడ్-ఎస్ : కొత్త కలర్ ఆప్షన్స్

ఫియర్‌లెస్ బ్లాక్ కలర్

యమహా ఎఫ్‌జెడ్-ఎస్ : కొత్త కలర్ ఆప్షన్స్

యమహా ఎఫ్‌జెడ్-ఎస్ : కొత్త కలర్ ఆప్షన్స్

గ్లోరీ గోల్డ్ కలర్

యమహా ఎఫ్‌జెడ్-ఎస్ : కొత్త కలర్ ఆప్షన్స్

యమహా ఎఫ్‌జెడ్-ఎస్ : కొత్త కలర్ ఆప్షన్స్

టెంపెస్ట్ బ్లూ కలర్

యమహా ఎఫ్‌జెడ్-ఎస్ : కొత్త కలర్ ఆప్షన్స్

యమహా ఎఫ్‌జెడ్-ఎస్ : కొత్త కలర్ ఆప్షన్స్

రేజింగ్ రెడ్ కలర్


ప్రత్యేకించి నేటి తరం యువతను టార్గెట్ చేసుకొని యమహా అందిస్తున్న ఈ స్పోర్ట్స్ బైక్ యూరోపియన్ ఇంటర్నేషనల్ డిజైన్, సరికొత్త కలర్స్, బాడీ గ్రాఫిక్స్, ఏరోడైనమిక్స్, స్టయిలిష్ అండ్ స్పోర్టీ కార్బన్ పాటర్న్ మీటర్ కన్సోల్, ఆకర్షనీయమైన హెడ్‌ల్యాంప్‌లతో మంచి లుక్‌ను కలిగి ఉంటుంది. ఫ్యాషనబల్, స్టయిలిష్ రైడ్ కోరుకునే యువతకు ఈ స్పోర్ట్స్ బైక్ ఓ చక్కటి ఆప్షన్‌గా నిలుస్తుంది.

యమహా ఎఫ్‌జెడ్-ఎస్‌ బైక్‌లో సరికొత్త 153సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, 2-వాల్వ్, ఎస్ఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 14 పిఎస్‌ల గరిష్ట పవర్‌ను, 13.6 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. భారత మార్కెట్లో యమహా ఎఫ్‌జెడ్-ఎస్ ధర రూ.71,530 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, March 16, 2013, 11:39 [IST]
English summary
Japanese two-wheeler manufacturer India Yamaha Motor has introduced four new attractive color options for its flagship FZ-S bike. 2013 Yamaha FZ-S is now available in four new colors named as Fearless Black, Glory Gold, Raging Red & Tempest Blue.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+