అప్‌గ్రేడెడ్ యమహా ఎస్‌జెడ్-ఆర్ఆర్ వెర్షన్ 2.0 బైక్ విడుదల
జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న మోటార్‌సైకిళ్లను అన్నింటినీ క్రమంగా అప్‌గ్రేడ్ చేసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా.. కంపెనీ విక్రయిస్తున్న 'యమహా ఎస్‌జెడ్-ఆర్ఆర్'లో రిఫ్రెష్డ్ వెర్షన్‌ను పరిచయం చేసింది.
యమహా ఎస్‌జెడ్-ఆర్ఆర్ వెర్షన్ 2.0 పేరిట విడుదల చేసిన ఈ రిఫ్రెష్డ్ వెర్షన్‌లో బ్లూకోర్ టెక్నాలజీని ఉపయోగించారు. బ్లూ కోర్ టెక్నాలజీ వలన పవర్ లాస్ తగ్గి పెర్ఫార్మెన్స్ మరింత పెరగటంతో పాటుగా మైలేజ్ కూడా పెరుగుతుందని కంపెనీ వివరించింది.

ఈ బైక్‌లో అమర్చిన రీడిజైన్డ్ 149సీసీ, ఎస్ఓహెచ్‌సి, సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 13.1 పిఎస్‌ల శక్తిని, 12.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది, ఇంధనం కార్బురేటర్ ద్వారా సప్లయ్ అవుతుంది.
యవతను లక్ష్యంగా చేసుకొని, వారి అవసరాలకు తగినట్లుగా కొత్త యమహా ఎస్‌జెడ్-ఆర్ఆర్ వెర్షన్ 2.0 మోటార్‌సైకిల్‌ను తీర్చిదిద్దామని కంపెనీ పేర్కొంది. దేశీయ విపణిలో యమహా ఎస్‌జెడ్-ఆర్ఆర్ వెర్షన్ 2.0 ధరను రూ.65,300 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించారు.


Click it and Unblock the Notifications








