హోలీ కలర్స్: యమహా ఆర్15లో కొత్త కలర్ ఆప్షన్స్..
యమహా మోటార్ ఇండియా సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న బడ్జెట్ స్పోర్ట్స్ బైక్ 'యమహా ఆర్15 వెర్షన్ 2.0' మోడల్‌లో కంపెనీ తాజాగా రెండు కొత్త కలర్లను పరిచయం చేసింది. రంగుల పండుగ హోలీ సీజన్ నేపథ్యంలో, యమహా ఈ కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది.
కొత్త యమహా ఆర్15 వెర్షన్ 2.0 ఇప్పుడు జిపి బ్లూ, స్ట్రీకింగ్ కయాన్ రంగులలో లభిస్తుంది. ఈ కొత్త వేరియంట్‌లో కేవలం కొత్త పెయింట్ ఆప్షన్స్ మినహా ఎలాంటి ఇతర మార్పులు చేర్పులు లేవు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అధీకృత యమహా డీలర్ల వద్ద ఈ కొత్త వేరియంట్ యమహా ఆర్15 వెర్షన్ 2.0 లభ్యం కానుంది.

ఇంజన్ విషయానికి వస్తే.. ఇందులో 150సీసీ లిక్విడ్ కూల్డ్, 4-స్ట్రోక్ ఎస్ఓహెచ్‌సి, 4 వాల్వ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 17 బిహెచ్‌పిల శక్తిని, 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 13.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
యమహా ఆర్15 వెర్షన్ 2.0లో బాక్‌లో స్ప్లిట్ సీట్, వెడల్పాటి వెనుక టైరు, కొత్త టెయిల్ కౌల్, సరికొత్త మిడిల్ కౌల్ డిజైన్, రియర్ డిస్క్ బ్రేక్, రీడిజైన్ చేయబడిన సైలెన్సర్, బైక్ వెనుక భాగాన అమర్చిన ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, టెన్ స్పోక్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ కోటింగ్ ఇంజన్‌లు, డబుల్ హారన్, డిజైనర్ రియర్ మడ్‌గార్డ్, అల్యూమినియం స్వింగ్ఆర్మ్, లింక్డ్ టైప్ మోనోక్రాస్ సస్పెన్షన్ వంటి పలు విశిష్టతలు ఉన్నాయి.

ఈ సందర్భంగా యమహా మోటార్ ఇండియా సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాయ్ కురియెన్ మాట్లాడుతూ.. ఆర్15ను ప్రత్యేకించి రేసింగ్ అభిమానుల కోసం డిజైన్ చేశామని, యువతలో ఈ బైక్ అంటే మంచి క్రేజ్ నెలకొందని, పవర్ అండ్ ప్యాషన్‌ను కోరుకునే వారికి ఈ బైక్ చక్కగా సరిపోతుందని అన్నారు.


Click it and Unblock the Notifications








