2015లో 'యమహా ఆర్25' 250సీసీ బైక్ విడుదల

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా భారత మార్కెట్‌కు ఓ సరికొత్త 250సీసీ బైక్‌ను పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. గడచిన సంవత్సరం జరిగిన 2013 టోక్యో మోటార్ షోలో కంపెనీ తొలిసారిగా ఆవిష్కరించిన యమహా ఆర్25 అనే 250సీసీ కాన్సెప్ట్ బైక్‌ను గడచిన ఫిబ్రవరి నెలలో భారత్‌లో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పో ద్వారా ఇండియన్ బైక్ ప్రియులకు కూడా దీనిని పరిచయం చేసింది.

ప్రస్తుతం భారత్ వంటి మార్కెట్లలో తక్కువ ఇంజన్ సీసీ పెర్ఫార్మెన్స్ బైక్‌లకు మంచి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ సెగ్మెంట్లోని అవకాశాలను క్యాష్ చేసుకోవాలని యమహా యోచిస్తోంది. ఇందులో భాగంగానే, కంపెనీ తమ ఆర్25 కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేసింది. అయితే, ఇప్పుడు మీరు ఈ ఫొటోలో చూడబోయే ఆర్25 బైక్‌కి ఇండియన్ వెర్షన్ ఆర్25 బైక్‌కి కొద్దిపాటి మార్పులు ఉండే అవకాశం ఉంది.

అవేంటో తెలుసుకుందాం రండి..!

యమహా ఆర్25

యమహా ఆర్25 బైక్‌లో 250సీసీ, లిక్విడ్ కూల్డ్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్, పారలల్ ట్విన్ సిలిండ్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ పెర్ఫార్మెన్స్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

యమహా ఆర్25

యమహా అందిస్తున్న వైజెడ్ఆర్-ఎమ్1 మోటోజిపి రేస్ బైక్ నుంచి స్ఫూర్తి పొంది ఈ ఆర్25 బైక్‌ను డిజైన్ చేశారు. అందుకే, దీని డిజైన్ రేస్ బైక్‌ల డిజైన్‌ను తలపిస్తుంది.

యమహా ఆర్25

షార్ప్ టెయిల్ సెక్షన్, షార్ప్ లుకింగ్ ఫ్రంట్ కౌల్‌తో యమహా ఆర్25 మంచి స్పోర్టీ లుక్‌ని కలిగి ఉంటుంది. అయితే, ప్రొడక్షన్ వెర్షన్‌కు వచ్చే సరికి దీని డిజైన్‌లో కొన్ని చిన్నపాటి మార్పులు చేసే అవకాశం ఉంది.

యమహా ఆర్25

ప్రొడక్షన్ వెర్షన్ యమహా ఆర్25 బైక్‌లో రైట్‌సైడ్ అప్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్స్, రెండు చక్రాలపై సింగిల్ డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లను చూడొచ్చు.

యమహా ఆర్25

ఈ సరికొత్త యమహా ఆర్25 250సీసీ వచ్చే ఏడాదిలో భారత మార్కెట్లో విడుదల కానుంది. అయితే, ఈ సెగ్మెంట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, యమహా ఈ బైక్‌ను అంతకన్నా ముందుగానే విడుదల చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

More from DriveSpark

Article Published On: Thursday, March 6, 2014, 10:28 [IST]
English summary
Yamaha R25 is a quarter liter sportsbike the Japanese two wheeler major is currently developing. The R25 was first showcased at the Tokyo Motor Show in November 2013 and was later brought to India for the Auto Expo 2014 in February.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+