యమహా రే స్కూటర్‌లో సమస్యలు; 56,802 యూనిట్లు రీకాల్

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ ఇండియా యమహా మోటార్స్, భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన తమ మొట్టమొదటి స్కూటర్ 'యమహా రే'లో తయారీ లోపాలు గుర్తించినట్లు కంపెనీ పేర్కొంది. వెల్డింగ్ సరిగా చేయని కారణంగా కొన్ని స్కూటర్లలో హాండిల్ బార్‌లు పటిష్టంగా లేవని గుర్తించినట్లు యమహా తెలిపింది. ఈ సమస్యను సరిచేసేందుకు గాను 56,082 యమహా రే స్కూటర్లను వెనక్కి తీసుకుంటున్నట్లు (రీకాల్) కంపెనీ ప్రకటించింది.

అయితే, ఏయే తేదీలలో ఉత్పత్తి అయిన స్కూటర్లలో ఈ సమస్య ఉందో కంపెనీ స్పష్టంగా తెలుపలేదు. కాగా, ఈ వెల్డింగ్ సమస్య కారణంగా స్టీరింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన ఇబ్బందులు తలత్తే ఆస్కారం ఉన్నట్లు గుర్తించామని, ఈ రీకాల్‌కు సంబంధించి కస్టమర్లకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నామని, సమస్యను గుర్తించిన వాటిలో హ్యాండిల్ బార్లను ఉచితంగా రీప్లేస్ చేస్తామని యమహా పేర్కొంది. ఇందుకోసం 'రే రీఫ్రెష్ క్యాంపైన్'ను ఇండియా యమహా మోటార్స్ దేశవ్యాప్తంగా డీలర్ల ద్వారా నిర్వహించనుంది.

వినియోగదారులు తమ యమహా రే స్కూటర్‌లో సమస్య ఉంటే సంబంధిత అధీకృత డీలర్లను సంప్రదించి సరిచేయించుకోవచ్చు. ఈ సమస్య కేవలం రే స్కూటర్లకు మాత్రమే పరిమితమని, తాము ఇటీవల ప్రవేశపెట్టిన రే జెడ్ స్కూటర్లలో ఎలాంటి సమస్యలు లేవని యమహా స్పష్టం చేసింది.

Yamaha Ray

గడచిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో యమహా తమ రే స్కూటర్ దేశీయ విపణిలో విడుదల చేసింది. యమహా రే స్కూటర్‌లో ఉపయోగించిన 113సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎస్ఓహెచ్‌సి, 2-వాల్వ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 7. పిఎస్‌ల శక్తిని, 5000 ఆర్‌పిఎమ్ వద్ద8.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది లీటరుకు 53 కి.మీ. మైలేజీనిస్తుంది. యమహా రే స్కూటర్ రెండేళ్లు లేదా 24,000 కి.మీ. (ఏది ముందు మగిస్తే అది) వారంటీతో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, July 22, 2013, 9:40 [IST]
English summary
Two-wheeler maker India Yamaha Motor has said it is recalling 56,082 units of its scooter 'Ray' after detecting insufficient strength in the handlebar of some vehicles due to inadequate welding. The company, however, did not share the manufacturing dates of the scooters which will be affected by the recall.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+