హోండా యాక్టివాకు పోటీగా యమహా యునిసెక్స్ స్కూటర్

By Ravi

మార్కెట్లో స్త్రీ, పురుషులు ఇద్దరికీ సూట్ అయ్యే స్కూటర్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది హోండా యాక్టివానే. ఇప్పుడు ఆ యాక్టివా సవాల్ చేసేందుకు మరో కొత్త స్కూటర్ మార్కెట్లోకి రాబోతుంది. జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా స్త్రీ, పురుషుల కోసం ఓ సరికొత్త స్కూటర్‌ను తయారు చేస్తోంది.

ప్రస్తుతం దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్లో స్కూటర్ల విభాగం శరవేగంగా వృద్ధి చెందుతున్న సంగతి తెలిసినదే. రే సిరీస్ స్కూటర్ల విడుదలతో ఈ విభాగంలో 5 శాతం మార్కెట్ వాటా దక్కించుకున్న యమహా, ఈ మార్కెట్ మరింత పెంచుకునే దిశగా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే, హోండా యాక్టివాకు పోటీగా ఓ కొత్త స్కూటర్‌ను ప్రవేశపెట్టనున్న కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు.

Yamaha Ray

యమహా మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అసానో మసాకి ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ.. తమ ప్రీమియం మోటార్‌సైకిళ్లతో భారతీయ యువతలో పటిష్టమైన బ్రాండ్‌ను సృష్టించినప్పటికీ, 90 శాతం ద్విచక్ర వాహనాలను రోజూవారీ ప్రయాణాల కోసం వినియోగించబడుతున్నాయని, ఈ నేపథ్యంలో స్త్రీ పురుషులు ఇరువురికి సరిపోయే విధంగా ఉండే ఫ్యామిలీ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంటుందని ఆయన అన్నారు.

ఈ కొత్త స్కూటర్‌ను ప్రవేశపెట్టడం ద్వారా తమ కంపెనీ అమ్మకాలు మరింత జోరందుకునే ఆస్కారం ఉందని మసాకి చెప్పారు. అయితే, ఈ స్కూటర్ విడుదల సమయాన్ని మరియు దానికి సంబంధించిన మరిన్ని వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో యమహా తమ కొత్త స్కూటర్‌ను ప్రదర్శించనుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, October 29, 2013, 20:58 [IST]
English summary
Japanese two-wheeler manufacturer Yamaha Motor India is planing to launch a unisex scooter next year to take on the market leader Honda's Activa. Stay tuned for latest updates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+