2015 యమహా ఆర్1, ఆర్1ఎమ్ మోటార్‌సైకిళ్ల ఆవిష్కరణ

By Ravi

జపాన్ ద్విచక్ర వాహన దిగ్గజం యమహా అందిస్తున్న లీటర్ క్లాస్ (1000సీసీ) మోటార్‌సైకిల్ యమహా ఆర్1లో కంపెనీ రెండు సరికొత్త వేరియంట్లను ఆవిష్కరించింది. సరికొత్త హంగులతో, మరిన్ని రిఫ్రెష్డ్ ఫీచర్స్‌తో ఈ కొత్త మోడళ్లను తీర్చిదిద్దారు.

'ఏది ఒకేలా ఉండదు' అనే ట్యాగ్‌లైన్‌తో ఈ బైక్ కంపెనీ ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించనుంది. ప్యారిస్‌లోని మిలన్‌లో జరుగుతున్న 2014 ఈఐసిఎమ్ఐ షోలో హయమహా రెండు 2015 వెర్షన్ వైజెడ్ఎఫ్-ఆర్1 బైక్‌లను ఆవిష్కరించింది.

ఈ రెండు మోటార్‌సైకిళ్లలో యమహా వైజెడ్ఎఫ్-ఆర్1 స్ట్రీట్ వెర్షన్ బైక్ కాగా, యమహా వైజెడ్ఎఫ్-ఆర్1ఎమ్ రేస్ వెర్షన్ బైక్. యమహాకు చెందిన మోటోజిపి ప్రోటోటైప్ మెషీనరీలోని అనే కాంపోనెంట్స్‌ను ఈ బైక్‌లలో ఉపయోగించారు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

2015 యమహా ఆర్1

తర్వాతి స్లైడ్‌లలో సరికొత్త 2015 యమహా ఆర్1 మోటార్‌సైకిళ్లకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోండి.

2015 యమహా ఆర్1

వాలెంటియో రోస్సి యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించుకొని యమహా తమ కొత్త 2015 లీటర్ క్లాస్ మోటార్‌సైకిల్‌ను తయారు చేసింది. ఆర్1ఎమ్ మోడల్‌లో ఎమ్ బ్యాడ్జ్ ఓ లిమిటెడ్ ఎడిషన్ మోడల్, ఇదొక రేస్ స్పెసిఫిక్ బైక్.

2015 యమహా ఆర్1

కొత్త 2015 యమహా ఆర్1 బైక్‌లో ఇన్-లైన్ 4-సిలిండర్, 998సీసీ, 4-స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇందులో క్రాస్ ప్లేన్ క్రాంక్‌షాప్ట్, 2-డైరెక్షనల్ ఫ్యూయెల్ ఇంజెక్టర్, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్, 10.5 లీటర్ ఎయిర్ బాక్స్ ఉంటాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 200 హార్స్‌పవర్‌ల శక్తిని, 112 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. దీని బరువు 199 కిలోలు.

2015 యమహా ఆర్1

కొత్త 2015 యమహా ఆర్1 బైక్ 6-యాక్సిస్ ఇనెర్షియల్ మెజర్‌మెంట్ యూనిట్ విత్ గైరో అండ్ ది సెన్సార్లతో లభిస్తుంది. అనేక గిజ్మోలు ఒక్ ప్యాకేజ్‌లో కలిగిన స్ట్రీట్ లీగల్ మోటార్‌సైకిల్ ఇదొక్కటే. ఇందులో ఇంకా ట్రాక్షన్ కంట్రోల్, స్లైడ్ కంట్రోల్, ఫ్రంట్ లిఫ్ట్ కంట్రోల్, క్విక్ షిఫ్టర్, లాంచ్ కంట్రోల్, ఏబిఎస్ వంటి ఫీచర్లున్నాయి.

2015 యమహా ఆర్1

ఈ కొత్త యమహా వైజెడ్ఎఫ్-ఆర్1 మోటార్‌సైకిల్‌కు సంబంధించి ధర, ఇతర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇది వచ్చే ఏడాది నుంచి కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ముందుగా యూరోపియన్ మార్కెట్స్ ఆ తర్వాత ఏషియన్ మార్కెట్లలో ఇది విడుదల కానుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, November 4, 2014, 13:10 [IST]
English summary
At the ongoing 2014 EICMA show at Milan, Paris, Yamaha has showcased their 2015 YZF-R1 and a race spec model called the YZF-R1M. The motorcycle shares a host of components from Yamaha's MotoGP prototype machinery.
 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+