యమహా వి-మ్యాక్స్ కార్బన్ స్పెషల్ ఎడిషన్ విడుదల
జపనీస్ బైక్ మేకర్ యమహా అందిస్తున్న పవర్‌ఫుల్ క్రూజర్ మోటార్‌సైకిల్ వి-మ్యాక్స్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కంపెనీ ఇందులో ఓ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. 'యమహా వి-మ్యాక్స్ కార్బన్' పేరుతో ఈ ప్రత్యేక వార్షికోత్సవ ఎడిషన్ లభ్యం కానుంది.
ఈ మోటార్‌సైకిల్‌ను మరింత ఎక్స్‌క్లూజివ్‌గా మార్చేందుకు గాను యమహా వి-మ్యాక్స్ కార్బన్‌లో ఎక్కువగా కార్బన్ ఫైబర్ భాగాలను ఉపయోగించారు. ఇందులో కేవలం కాస్మోటిక్ మార్పులు మాత్రమే ఉన్నాయి, యాంత్రికపరంగా ఎలాంటి మార్పులు లేవు.

యమహా వి-మ్యాక్స్ కార్బన్‌లో 1679సీసీ, వి4, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 200 హార్స్ పవర్‌ల శక్తిని, 166.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‍బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.
ఈ వార్షికోత్సవ ఎడిషన్ వి-మ్యాక్స్ కార్బన్‌లో ట్యాంక్ కవర్, కార్బన్ ఫైబర్‌తో తయారు చేసిన ఫ్రంట్ అండ్ రియర్ ఫెండర్స్ (మడ్‌గార్డ్స్), కొత్త 5-స్పోక్ అల్లాయ్ వీల్స్, 200/50-18 రియర్ టైర్ వంటి ఫీచర్లున్నాయి. దీని ధర 18,749 పౌండ్లు (సుమారు రూ.17.77 లక్షలు).



Click it and Unblock the Notifications








