యమహా నుంచి చవక బైక్; ధర రూ.30,000
జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా భారత మార్కెట్లో భారీ మార్కెట్ వాటాను ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కంపెనీ మాస్ మార్కెట్‌ను టార్గెట్‌గా చేసుకుంది. కేవలం 500 డాలర్లకే (సుమారు రూ.30,000) ఓ చీప్ అండ్ బెస్ట్ బైక్‌ను అందించాలని యమహా భావిస్తోంది. సోమవారం తమ అధునాతన యమహా ఎఫ్‌జెడ్ సిరీస్ వెర్షన్ 2 మోడళ్లను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది.
యమహా నుంచి వస్తున్న ఈ చవక్ మోటార్‌సైకిల్‌ను ప్రత్యేకించి గ్రామీణ మార్కెట్లను లక్ష్యంగా చేసుకొన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందులో 100సీసీ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ బైక్ ప్రాజెక్టు పని ప్రారంభమైందని, కొత్త బైక్ 500 డాలర్ల కన్నా తక్కువగా ఉంటుందా లేదా ఎక్కువ ఉంటుందా అనేది ఇప్పుడే చెప్పలేకపోయినప్పటికీ, కనీ ధరను మాత్రం 500 డాలర్లుగా నిర్ణయించుకున్నామని యమహా మోటార్ ఆర్ అండ్ డీ ఇండియా ఎండీ తొషికజు కొబయాషి తెలిపారు.

కాగా.. ఈ బైక్‌ను ఎప్పుడు మార్కెట్లోకి తీసుకువచ్చేది ఖచ్చితంగా చెప్పకపోయినప్పటికీ, ఈ బైక్‌ను మాత్రం మొట్టమొదటిగా భారతదేశంలోనే విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ఈ చవక బైక్ కారణంగా భారత విపణిలో తమ మార్కెట్ వాటా మరింతగా పెరగగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
వాస్తవానికి, ప్రస్తుతం యమహా ఇండియాకు ఎంట్రీ లెవల్ బైక్స్ సెగ్మెంట్లో పెద్దగా చెప్పుకోదగిన ఉత్పత్తులు లేవు. కేవలం 150సీసీ సెగ్మెంట్లోనే యమహాకు మంచి మార్కెట్ వాటా ఉంది. ఈ నేపథ్యంలో యమహా నుంచి రానున్న బడ్జెట్ బైక్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








