2014 యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 ఇప్పుడు కొత్త రంగుల్లో లభ్యం

By Ravi

యమహా అందిస్తున్న వైజెడ్ఎఫ్ ఆర్15 బైక్‌లో కంపెనీ 2014కు గాను ఓ సరికొత్త అప్‌గ్రేడెడ్ మోడల్‌ను విడుదల చేస్తుందనుకుంటే, కంపెనీ మాత్రం సింపుల్‌గా కలర్ మార్చి విడుదల చేసి, బైక్ ప్రియులను నిరుత్సాహపరిచింది. సెప్టెంబర్ 2011లో యమహా తమ వైజెడ్ఎఫ్ ఆర్15 బైక్‌లో వెర్షన్ 2.0 పేరిట అప్‌గ్రేడెడ్ మోడల్‌ను విడుదల చేసింది.

అయితే, ఈ ఏడాది వైజెడ్ఎఫ్ ఆర్15లో వెర్షన్ 3.0 వస్తుందనుకుంటే, కేవలం కొత్త పెయింట్ ఆప్షన్లతో కూడిన వైజెడ్ఎఫ్ ఆర్15 వెర్షన్ 2.0 మోడల్‌నే కంపెనీ విడుదల చేసింది. ఇది నాలుగు కొత్త రంగుల్లో లభిస్తుంది, అవి - రేరింగ్ రెడ్, ఇన్విజబిల్ బ్లాక్, రేసింగ్ బ్లూ, గ్రిడ్ గోల్డ్. వీటన్నింటిలో గ్రిడ్ గోల్డ్ కలర్ ఓ లిమిటెడ్ ఎడిషన్ కలర్. ఇది కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే లభ్యం కానుంది.

ఇది కూడా చదవండి: వెస్పా ఎస్125 స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ

యమహా ఆర్15 మోటార్‌సైకిల్‌లో అమర్చిన 150సీసీ లిక్విడ్ కూల్డ్, ఫోర్ స్ట్రోక్ ఇంజన్ గరిష్టంగా 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 17 బిహెచ్‌పిల శక్తిని, 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 13.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.


యమహా ఆర్15 బాక్‌లో స్ప్లిట్ సీట్, వెడల్పాటి వెనుక టైరు, కొత్త టెయిల్ కౌల్, సరికొత్త మిడిల్ కౌల్ డిజైన్, రియర్ డిస్క్ బ్రేక్‌, రీడిజైన్ చేయబడిన సైలెన్సర్‌, బైక్ వెనుక భాగాన అమర్చిన ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, టెన్ స్పోక్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ కోటింగ్ ఇంజన్‌లు, డబుల్ హారన్, డిజైనర్ రియర్ మడ్‌గార్డ్, అల్యూమినియం స్వింగ్ఆర్మ్, లింక్డ్ టైప్ మోనోక్రాస్ సస్పెన్షన్‌ వంటి అనేక విశిష్టతలు ఉన్నాయి. ఈ బైక్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లను క్రింద గమనించవచ్చు.

ఇంజన్:
* ఇంజన్ టైప్ : లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎస్ఓహెచ్‌సి, 4-వాల్వ్
* సిలిండర్ అరేంజ్‌మెంట్ : సింగిల్ సిలిండర్
* డిస్‌ప్లేస్‌మెంట్ : 149.8సీసీ
* బోర్ × స్ట్రోక్ : 57 ఎమ్ఎమ్ × 58.7 ఎమ్ఎమ్
* కంప్రెషన్ రేషియో : 10.4:1
* గరిష్ట పవర్ : 17 పిఎస్ / 8500 ఆర్‌పిఎమ్
* గరిష్ట టార్క్ : 15 ఎన్ఎమ్ / 7500 ఆర్‌పిఎమ్
* స్టార్టింగ్ సిస్టమ్ : ఎలక్ట్రిక్ స్టార్ట్
* లూబ్రికేషన్ : వెట్ సంప్
* ఇంధన ట్యాంక్ సామర్థ్యం : 12 లీటర్లు
* ఇంధన సరఫరా సిస్టమ్ : ఫ్యూయెల్ ఇంజెక్షన్
* ఇగ్నిషన్ సిస్టమ్ : టి.సి.ఐ
* ప్రైమరీ / సెకండరీ రిడక్షన్ రేషియో : 3.042 / 3.133
* క్లచ్ టైప్ : వెట్ మల్టిపుల్-డిస్క్
* ట్రాన్సిమిషన్ టైప్ : రిటర్న్ టైప్ 6-స్పీడ్
* గేర్ రేషియో : 1st = 2.833, 2nd = 1.875, 3rd = 1.364, 4th = 1.143, 5th = 0.957, 6th = 0.84

Yamaha YZF R15 New Colors For 2014

ఛాస్సిస్ :
* ఫ్రేమ్ టైప్ : డెల్టా బాక్స్
* క్యాస్టర్ / ట్రైల్ : 26° / 98mm
* టైర్ సైజ్ (ముందు మరియు వెనుక) : 90/80-17 మరియు 130/70-ఆర్17
* బ్రేక్ టైప్ (ముందు మరియు వెనుక) : హైడ్రాలిక్, సింగిల్ డిస్క్
* సస్పెన్షన్ టైప్ (ముందు మరియు వెనుక) : టెలిస్కోపిక్ / లింక్డ్ టైప్ మోనోక్రాస్
* హెడ్ లైట్ : లోబీమ్ 12వీ/35డబ్ల్యూ ఎక్స్1, హైబీమ్ 12వీ/35డబ్ల్యూ ఎక్స్2
* బ్యాటరీ : 12వీ, 3.5ఏహెచ్ (10హెచ్)

కొలతలు:
* మొత్తం పొడవు × వెడల్పు × ఎత్తు : 1970 ఎమ్ఎమ్ × 670 ఎమ్ఎమ్ × 1,070 ఎమ్ఎమ్
* సీట్ ఎత్తు : 800 ఎమ్ఎమ్
* వీల్‌బేస్ : 1345 ఎమ్ఎమ్
* మినిమమ్ గ్రౌండ్ క్లియెరెన్స్ : 160 ఎమ్ఎమ్
* కెర్బ్ వెయిట్ : 136 కేజీలు

More from DriveSpark

Article Published On: Thursday, March 20, 2014, 13:20 [IST]
English summary
We all thought there would be a new version 3.0 of Yamaha R15, that is not the case. The Japanese automobile manufacturer has only launched a variety of color options.There will be four new colors available, which the Japanese giant calls Raring Red, Invincible Black, Racing Blue, Grid Gold. Among all the color options the Grid Gold will be limited edition and will be available in selected numbers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+