ఇండోనేషియాలో 'యమహా ఆర్25' 250సీసీ బైక్ విడుదల
జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా గడచిన సంవత్సరం జరిగిన 2013 టోక్యో మోటార్ షోలో తొలిసారిగా ఆవిష్కరించిన తమ అధునాత 250సీసీ స్పోర్ట్స్ బైక్ 'యమహా వైజెడ్ఎఫ్-ఆర్25'ను కంపెనీ ఇండోనేషియా మార్కెట్లో విడుదల చేసింది. ఇండోనేషియన్ మార్కెట్లో దీని ధర 53 మిలియన్ ఇండోనేషియన్ రుపయ్య (మనదేశ కరెన్సీలో సుమారు రూ.2.71 లక్షలు)గా ఉంది.
యమహా ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో భారత్‌లో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో కూడా తమ ఆర్25 మోటార్‌సైకిల్‌ను ప్రదర్శనకు ఉంచింది. తాజాగా ఈ బైక్ ఇండోనేషియన్ మార్కెట్లో విడుదలైన నేపథ్యంలో, త్వరలోనే ఇది ఇండియన్ మార్కెట్లో కూడా విడుదలయ్యే అకాశాలు కనిపిస్తున్నాయి. యమహా ఆర్1, ఆర్6, ఎమ్1 మోటోజిపి బైక్‌లను స్ఫూర్తిపొంది దీనిని తయారు చేశారు.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

యమహా వైజెడ్ఎఫ్-ఆర్25 మోటార్‌సైకిల్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

ఈ బైక్‌లో సరికొత్త 250సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ డయాసిల్ (డై కాస్టింగ్ అల్యూమినియం సిలికాన్) అనే విశిష్టమైన సిలిండర్లను ఉపయోగించుకుంటుంది. దీని వలన ఇంజన్ బరువు తగ్గడమే కాకుండా, వేడి కూడా తక్కువగా ఉంటుంది. యమహా ఓ 2-సిలిండర్ ఇంజన్‌లో ఈ తరహా టెక్నాలజీని ఉపయోగించడం ఇదే మొట్టమొదటిసారి.

యమహా ఆర్25 బైక్‌లో 249సీసీ, లిక్విడ్ కూల్డ్, 2-సిలిండర్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 12,000 ఆర్‌పిఎమ్ వద్ద 35 హార్స్ పవర్‌ల శక్తిని, 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 22.6 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‍బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

యమహా అందిస్తున్న వైజెడ్ఆర్-ఎమ్1 మోటోజిపి రేస్ బైక్ నుంచి స్ఫూర్తి పొంది ఈ ఆర్25 బైక్‌ను డిజైన్ చేశారు. అందుకే, దీని డిజైన్ రేస్ బైక్‌ల డిజైన్‌ను తలపిస్తుంది. ప్రధానంగా దీని హెడ్‌లైట్ యమహా వైజెడ్ఆర్-ఎమ్1 నుంచి స్ఫూర్తి పొంది తయారు చేసినట్లు ఉంటుంది.

షార్ప్ టెయిల్ సెక్షన్, షార్ప్ లుకింగ్ ఫ్రంట్ కౌల్‌తో యమహా ఆర్25 మంచి స్పోర్టీ లుక్‌ని కలిగి ఉంటుంది. ఈ బైక్‌లో ఆర్-సిరీస్ డిఎన్‌ఏ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది స్పోర్టీ లుక్‌ని, పెర్ఫార్మెన్స్‌ను కలిగి ఉంటుంది.

యమహా ఆర్25 తేలికపాటి నిర్మాణాన్ని కలిగి ఉండి, ఎక్సలెంట్ సెంట్రలైజేషన్‌ను కలిగి ఉంటుంది. దీని మొత్తం బరువు 166 కేజీలు. ఇధి 2.09 మీ పొడవును, 0.720 మీట వెడల్పును, 1.135 మీటర్ల ఎత్తును కలిగి ఉంటుంది. దీని సైట్ హైట్ 0.780 మీటర్లు. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్లు.

ఈ సరికొత్త యమహా ఆర్25 250సీసీ వచ్చే ఏడాదిలో భారత మార్కెట్లో విడుదల కానుంది. అయితే, ఈ సెగ్మెంట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, యమహా ఈ బైక్‌ను అంతకన్నా ముందుగానే విడుదల చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.


Click it and Unblock the Notifications








