2015 ఇండియా బైక్ వీక్‌లో 'యువరాజ్' కస్టమైజ్డ్ మోటార్‌సైకిల్!

By Ravi

భారత క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు బైక్‌లంటే ఎంత క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 20, 21వ తేదీలలో గోవాలో జరగనున్న 2015 ఇండియా బైక్ వీక్‌లో యువరాజ్ సింగ్ కోసం ప్రత్యేకంగా కస్టమైజ్ చేసిన 'యువీకెన్ ఎక్స్12' (YOUWECAN X12) అనే బైక్‌ను ఆవిష్కరించనున్నారు.

యువీకెన్ ఎక్స్12 బైక్‌ను ప్రముఖ ఆటోమొబైల్స్ కస్టమైజేషన్, రీస్టోరేషన్ స్పెషలిస్ట్ ఆటోలాగ్ డిజైన్ సంస్థ కస్టమైజ్ చేసింది. కెటిఎమ్ మోటార్‌సైకిల్‌ను ఆధారంగా చేసుకొని యువరాజ్ సింగ్ కోసం ఈ బైక్‌ను స్పెషల్‌గా కస్టమైజ్ చేశారు. ఈ కస్టమైజ్డ్ బైక్‌కి సంబంధించిన ఇంజన్, పెర్ఫార్మెన్స్ తదితర వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.

Yuvraj Singh To Unveil His Custom Motorcycle At 2015 India Bike Week

ఈ బైక్‌తో పాటుగా ఆటోలాగ్ డిజైన్ మరికొన్ని ఇతర కస్టమైజ్డ్ వాహనాలను ఈ షోలో ప్రదర్శించనుంది. మూడవ ఎడిషన్ ఇండియా బైక్ వీక్ ఫెస్టివల్‌ను గోవాలోని వగతోర్ ప్రాంతం వద్ద ఫిబ్రవరి 20, 2015 మరియు ఫిబ్రవరి 21, 2015 తేదీలలో నిర్వహించనున్నారు. భారత్‌లోని సెవంటీ ఈవెంట్ మీడియా గ్రూప్, ఫాక్స్ లైఫ్ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి.

ఈ ఏడాది ఇండియా బైక్ వీక్‌లో హౌలింగ్ డాగ్ అనే డ్రాగ్ రేస్ ఈవెంట్, డర్ట్ ట్రాక్ ఛాలెంజ్ అనే ఆఫ్-రోడ్ ఈవెంట్ మరియు ఆల్ ఇండియా స్టంట్ ఛాంపియన్‌షిప్ ఫినాలే కార్యక్రమాలు జరగనున్నాయి. ఇదివరకటి రెండు ఎడిషన్ల ఇండియా బైక్ వీక్‌లతో పోల్చుకుంటే, ఈ ఏడాది జరగనున్న మూడవ ఎడిషన్ ఇండియా బైక్ వీక్‌కు ఎక్కువ స్పందన లభించవచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మా డ్రైవ్‌స్పార్క్ బృందం ప్రత్యక్షంగా కవర్ చేయనుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, February 14, 2015, 14:32 [IST]
English summary
Yuvraj Singh has named his Custom Motorcycle ‘YOUWECAN X12', which will be unveiled at 2015 India Bike Week. It is being build by Autologue Design, who specialise in customisation and restoration of automotives.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+