Sangishetti Upender       May 02, 2024

సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఆంపియర్‌ నెక్సస్‌ ఎట్టకేలకు విడుదల

ఫ్యామిలీ స్కూటర్‌

ఈ హై పర్ఫామెన్స్‌ స్కూటర్‌ ఫ్యామిలీ కోసం ప్రత్యేకంగా గ్రీవ్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ లాంచ్‌ చేసింది.

వేరియంట్స్‌

ఆంపియర్ నెక్సస్‌ ఇ స్కూటర్‌ను రెండు వేరియంట్లు.. EX, ST లలో విడుదల చేసింది.

కలర్స్‌

ఈ స్కూటర్‌ 4 ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంటుంది. జాన్స్కర్ ఆక్వా, ఇండియన్ రెడ్, లూనార్ వైట్ మరియు స్టీల్ గ్రే కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

ఫీచర్లు

టాప్‌ స్పెక్‌ ST లో బ్లూటూత్ కనెక్టివిటీ మరియు టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో కూడిన 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్‌ను అందిస్తోంది.

డిజైన్‌

Nexus టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్బర్‌లను కలిగి ఉండగా.. ఫ్యామిలీ-ఫోకస్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఫార్ములాతో దీనిని రూపొందించారు.

బ్యాటరీ

కొత్త 4kW ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది. ఇది గరిష్ఠంగా గంటకు 93 కి.మీ వేగంతో దూసుకుపోతుంది.

రేంజ్‌

3 kWh, IP67 రేటెడ్ బ్యాటరీ LFP రకాన్ని కలిగి ఉంది. పూర్తి ఛార్జ్‌పై 136 కి.మీ సర్టిఫైడ్ రేంజ్‌ను కలిగి ఉంటుంది.

బుకింగ్‌

కస్టమర్లు రూ. 10,000 చెల్లించి తమ స్కూటర్‌ను బుక్‌ చేసుకోవచ్చు.

ధర

ప్రారంభ ధర రూ. 1,09,900. వేరియంట్లను బట్టి ధరలు మారుతుంటాయి.