ఏథర్ ఎనర్జీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూర్ రిజ్టాను లాంచ్
స్పెషాలిటీ
అతి పెద్ద సీటింగ్ సౌకర్యం, స్టోరేజ్ స్పేస్‌తో ఫ్యామిలీ స్కూటర్‌గా Ather Rizta విడుదల చేసింది.
బుకింగ్స్
ఆసక్తి గల కస్టమర్లు రూ. 999 చెల్లించి ఈ ఫ్యామిలీ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు.
డిజైన్
మృదువైన లైన్‌లు, గుండ్రని ప్యానెల్‌లు, మోనో-LED హెడ్‌ల్యాంప్, సొగసైన LED టైల్‌లైట్, 12-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది.
ఫీచర్లు
టచ్ ఫంక్షనాలిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ మరియు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన TFT డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా అధునాతన ఫీచర్లను కలిగి ఉంది.
రైడింగ్ మోడ్
రెండు విభిన్న రైడింగ్ మోడ్‌లు SmartEco మరియు Zip ప్రవేశపెట్టింది.
బ్యాటరీ ప్యాక్
ఇందులో శక్తివంతమైన PMS ఎలక్ట్రిక్ మోటారును అమర్చింది. కస్టమర్లకో కోసం మల్టీ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లను అందిస్తుంది.
రేంజ్
పూర్తి ఛార్జ్‌పై 105 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. పెద్ద 3.7 kWh బ్యాటరీ ప్యాక్ పూర్తి ఛార్జ్‌పై 125 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది.
పోటీ
TVS iQube, Ola S1 Pro, మరియు బజాజ్ చేతక్ వంటి ప్రముఖ స్కూటర్లకు గట్టి పోటీగా విడుదలైంది.
ధర
ఏథర్ రిజ్టా(Ather Rizta) ఫ్యామిలీ స్కూటర్‌ను సంస్థ రూ. 1.10 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది.