Sangishetti Upender       May 04, 2024

బజాజ్‌ సంస్థ పల్సర్‌ NS400 సిరీస్‌లో పవర్‌ఫుల్‌ బైక్‌ని విడుదల చేసింది

వేరియంట్‌

NS400Z పేరుతో తొలి బైక్‌ని నేడు లాంచ్‌ చేసింది. త్వరలోనే ఈ సిరీస్‌లో మరికొన్ని వేరియంట్లను సంస్థ విడుదల చేయనుంది.

ఇంజిన్‌

373cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో ఈ బైక్‌ పనిచేస్తుంది. 8800rpm వద్ద 40 PS మరియు 6500rpm వద్ద 35 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

ఫీచర్లు

NS400లో ఫుల్‌ అప్‌డేటెడ్‌ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా డాట్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లేతో అధునాతన కలర్ స్కీమ్‌లతో కూడిన పూర్తి-డిజిటల్ ఇంట్రుమెంట్ ప్యానెల్‌ని గమనించవచ్చు.

మరిన్ని ఫీచర్లు

బజాజ్ రైడ్ కనెక్ట్ యాప్‌ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీతో ఈ బైక్‌ని పూర్తిగా నేవిగేట్‌ చేయవచ్చు. టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ మరియు టెక్స్ట్ అలర్ట్‌లు, మ్యూజిక్ కంట్రోల్, ల్యాప్ టైమర్‌ని కంట్రోల్‌ చేయవచ్చు.

కలర్స్‌

ఈ బైక్‌ మొత్తం నాలుగు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండనుంది. అవి బ్లాక్, మెటాలిక్ పర్ల్‌ వైట్, కాక్‌టెయిల్ వైన్ రెడ్ మరియు ప్యూటర్ గ్రే కలర్లలో రానున్నాయి.

గేర్‌ బాక్స్‌

ఈ బైక్‌ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

రైడింగ్‌ మోడ్స్‌

రెయిన్, రోడ్, ఆఫ్-రోడ్ మరియు స్పోర్ట్ అనే నాలుగు రైడింగ్‌ మోడ్‌లు ఈ సరికొత్త బైక్‌లో గమనించవచ్చు.

రేంజ్‌

3 kWh, IP67 రేటెడ్ బ్యాటరీ LFP రకాన్ని కలిగి ఉంది. పూర్తి ఛార్జ్‌పై 136 కి.మీ సర్టిఫైడ్ రేంజ్‌ను కలిగి ఉంటుంది.

బుకింగ్‌

సమీపంలోని డీలర్స్‌ ద్వారా లేదా ఆన్‌లైన్‌లో రూ. 5000 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు.

ధర

బజాజ్ పల్సర్ NS400Z ధరను రూ. 1.85 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌) సంస్థ నిర్ణయించింది.