Sangishetti Upender Apr 17, 2024
'లెక్సస్ ఇండియా' నుంచి 'ఎన్ఎక్స్ 350హెచ్ ఓవర్‌ట్రైల్ ఎడిషన్' లాంచ్
పెయింట్ స్కీమ్
ఇది చూడటానికి ఇటీవలే మార్కెట్లో అడుగుపెట్టిన థార్ ఎర్త్ ఎడిషన్ మాదిరిగా ఉండే పెయింట్ స్కీమ్ పొందుతుంది.
డిజైన్
గ్రిల్, వింగ్ మిర్రర్స్, డోర్ హ్యాండిల్స్ మరియు రూప్ రైల్స్ వంటివన్నీ నలుపు రంగులో ఉండటం చూడవచ్చు.
వీల్స్
18 ఇంచెస్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ మరియు 235 / 60 టైర్స్ ఉండటం చూడవచ్చు. కఠినమైన రోడ్లపై సజావుగా ముందుకు సాగటానికి ఉపయోగపడతాయి.
ఇంటీరియర్ డిజైన్
ఆర్మ్‌రెస్ట్, సీటు అంచులు, డోర్ ప్యానెల్ వంటివన్నీ మట్టి రంగులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఫీచర్లు
ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ టెయిల్‌గేట్ మరియు 17 స్పీకర్ ఆడియో సిస్టం వంటి అనేక ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.
ఇంజిన్
లెక్సన్ ఎన్ఎక్స్ 350హెచ్ ఓవర్‌ట్రైల్ 2.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది.
ఇంజిన్
ఇందులోని 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు SUV 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌తో కూడా అందుబాటులో ఉంటుంది.
ఫర్ఫామెన్స్
మొత్తం సిస్టమ్ అవుట్‌పుట్ 243 హార్స్ పవర్ డెలివరీ చేస్తుంది. ఇది 6 టైప్ ఈ-సీవీటీ గేర్‌బాక్స్ ద్వారా అన్ని చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది.
పోటీ
ఆడి క్యూ5, బీఎండబ్ల్యూ ఎక్స్3, మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సీ మరియు వోల్వో ఎక్స్‌సీ 60 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
ధర
ఈ కారు ధర రూ. 71.17 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా) వద్ద ఉంది