Sangishetti Upender       Apr 25, 2024

అల్ట్రావైలెట్ ఎఫ్-77 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ని భారత మార్కెట్లో ఆ సంస్థ లాంచ్

వేరియంట్స్

ఎఫ్77 మ్యాక్ 2 (F77 Mach), ఎఫ్77 మ్యాక్ 2 రెకాన్ అనే రెండు వేరియంట్లుగా ఉన్నాయి.

బుకింగ్‌

ఈ బైక్స్ కావాలనుకునే వారు రూ.5,000 చెల్లిస్తే సరిపోతుంది.

మోటార్‌

F77 Mach 2కు 27kW మోటార్ శక్తిని అందిస్తుంది. అలాగే రీకాన్ 30kW మోటార్‌ ద్వారా పనిచేయనుంది.

బ్యాటరీ & రేంజ్‌

ఈ బైక్స్‌ సాధారణంగా 7.1kWh బ్యాటరీని పొందుతాయి. ఇవి 211KM రేంజ్‌ని అందిస్తుంది. రీకాన్ వేరియంట్‌ 10.3kWh బ్యాటరీతో వస్తుంది. ఇది 323km రేంజ్‌ని అందిస్తుంది.

ఫర్ఫామెన్స్‌

ఈ బైక్స్ వరుసగా ఇది 40బిహెచ్ పి పవర్ మరియు 100ఎన్ఎమ్ టార్క్ అవుట్ పుట్ ని అందిస్తాయి.

ఛార్జింగ్‌ ఆప్షన్స్‌

ఈ బైక్‌ కొనుగోలు చేసే వినియోగదారులు మూడు ఛార్జింగ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. స్టాండర్డ్ ఛార్జర్ మరియు బూస్ట్ ఛార్జర్స్‌ ఉన్నాయి.

ఛార్జింగ్‌

ఈ బ్యాటరీ ప్యాక్‌ కేవలం గంటలో 20 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జింగ్‌ పూర్తి చేయవచ్చు.

రైడింగ్ మోడ్స్‌

ఈ మోటార్ సైకిల్‌ గ్లైడ్, కాంబాట్ మరియు బాలిస్టిక్ అనే మూడు రైడింగ్ మోడ్‌లలో వస్తుంది.

ధర

ఎఫ్77 మ్యాక్ 2 (F77 Mach), ఎఫ్77 మ్యాక్ 2 రెకాన్ ధరలు రూ.2.99 లక్షలు, రూ.3.99 లక్షలుగా ఉన్నాయి.