అక్టోబర్ 20న ఫియట్ అవెంచురా క్రాసోవర్ విడుదల!

By Ravi

ఇటాలియన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫియట్ ఇండియా, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించిన కాంటెంపరరీ యుటిలిటీ వెహికల్ 'ఫియట్ అవెంచూరా'ను కంపెనీ ఈనెల 20వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

గడచిన నెల నుంచే ఫియట్ అవెంచురా కోసం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అధీకృత ఫియట్ ఇండియా డీలర్‌షిప్ కేంద్రాలలో ఈ మోడల్ కోసం బుకింగ్‌లను స్వీకరిస్తున్న సంగతి తెలిసినదే. ఫియట్ అవెంచురా ఇప్పటికే డీలర్‌షిప్ కేంద్రాలలో టెస్ట్ డ్రైవ్ కోసం అందుబాటులో ఉంది.

ఫియట్ ఇండియా ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త పుంటో ఇవో ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అవెంచురాని తయారు చేశారు. ఇది యాక్టివ్, డైనమిక్, ఎమోషన్ అనే మూడు వేరియంట్లలో లభ్యం కానుంది. ఆయా వేరియంట్లలో లభించే ఫీచర్లను ఈ కథనంలో తెలుసుకోండి.


ఫియట్ అవెంచురా యాక్టివ్ వేరియంట్‌లో లభించే ఫీచర్లు
ఈ వేరియంట్లో సెంట్రల్ లాకింగ్, రియర్ స్పాయిలర్, రియర్ ఫాగ్ ల్యాంప్స్, డ్యూయెల్ టోన్ డ్యాష్‌బోర్డ్, ఫ్రంట్ పవర్ విండోస్ (ఆటో-డౌన్ ఫంక్షన్‌తో), రిమోట్ కీలెస్ ఎంట్రీ, ఇన్‌క్లైనోమీటర్, కంపాస్, ఇండికేటర్లతో కూడిన సైడ్ వ్యూ మిర్రర్స్, ఫాలోమి ల్యాంప్స్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, క్లచ్ ఫుట్ రెస్ట్, డబుల్ ఫోల్డబిల్ రియర్ సీట్స్ వంటి ఫీచర్లున్నాయి.

ఫియట్ అవెంచురా డైనమిక్ వేరియంట్‌లో లభించే ఫీచర్లు
డైనమిక్ వేరియంట్లో.. యాక్టివ్ వేరియంట్లో లభించే అన్ని ఫీచర్లకు అదనంగా.. ఈబిడితో కూడిన ఏబిఎస్ (డీజిల్ ఇంజన్లో మాత్రమే), డోర్ హాజర్డ్ వార్నింగ్, బాడీ కలర్డ్ ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ఫ్యాబ్రిక్ డోర్ ట్రిమ్, రియర్ పవర్ విండోస్, హైట్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, ఆడియో సిస్టమ్ (స్పీడ్ సెన్సింగ్ వాల్యూమ్ కంట్రోల్స్‌తో), యూఎస్‌బి, ఆక్స్-ఇన్ సపోర్ట్, ఎక్స్‌టర్నల్ టెంపరేచర్ డిస్‌ప్లే, ప్రాక్టికల్ బూట్ ల్యాంప్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

Fiat Avventura

ఫియట్ అవెంచురా ఎమోషన్ వేరియంట్‌లో లభించే ఫీచర్లు
ఎమోషన్ వేరియంట్లో.. డైనమిక్ వేరియంట్లో లభించే అన్ని ఫీచర్లకు అదనంగా.. ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, అధునాతన 3-పాయింట్ ఈఎల్ఆర్ సీట్‌బెల్ట్స్, హైట్ అడ్జస్టబల్ ఫ్రంట్ సీట్ బెల్ట్స్, లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్ అండ్ గేర్ షిఫ్ట్ నాబ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసి వెంట్స్, రియర్ డిఫాగ్గర్ విత్ వైపర్, 60:40 రియర్ స్ప్లిట్ సీట్స్, బ్లూ అండ్ మి వాయిస్ రికగ్నైజేషన్ విత్ ఎస్ఎమ్ఎస్ రీడవుట్ ఫంక్షన్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

ఇతర ఫీచర్లు
ఫియట్ అవెంచురా క్రాసోవర్ ప్రమాదవశాత్తు రోడ్డుపై నుంచి క్రిందకు దొర్లిపోయినట్లయితే, ఇంజన్‌కు ఆటోమేటిక్‌గా ఇంధన సరఫరా నిలిచిపోయేలా ఏర్పాటు చేశారు. ఇందులోని ప్రత్యేక డ్యూయెల్ స్టేజ్ ఎయిర్‌బ్యాగ్స్ ప్రమాద తీవ్రతను బట్టి, దానికి అనుకూలంగా స్పందిస్తాయి. ఇది ఆరు రంగులలో (జాఫెరానో ఆరెంజ్, బ్రోన్కో టాన్, ఎగ్జోటికా రెడ్, మినిమనల్ గ్రే, హిప్‌హాప్ బ్లాక్, వోకల్ వైట్) లభిస్తుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
According the market sources, Fiat India will launch its crossover Avventura on 20th October 2014. The Italian manufacturer has showcased the Fiat Avventura at the 2014 Auto Expo held in New Delhi. Here is few exclusive details about the all new Avventura.
Story first published: Friday, October 17, 2014, 10:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X