జనవరి 15, 2014న డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి విడుదల

By Ravi

నిస్సాన్‌కు చెందిన డాట్సన్ బ్రాండ్ నుంచి రానున్న రెండవ ఉత్పత్తి 'డాట్సన్ గో ప్లస్' (Datsun Go+) ఎమ్‌పివి విడుదల తేదీ ఖరారైంది. ఈ మోడల్‌ను జనవరి 15, 2014వ తేదీన విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ మేరకు మీడియా ప్రతినిధులకు ఆహ్వానాలు కూడా పంపింది.

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి కోసం కంపెనీ ఇటీవలే రిషికేష్, ఉత్తరాఖాండ్ వద్ద ఓ మీడియా డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ టెస్ట్ డ్రైవ్ కార్యక్రమంలో మా డ్రైవ్‌స్పార్క్ బృందం కూడా పాల్గొంది. మరి మా టెస్ట్ డ్రైవ్ పరీక్షలో డాట్సన్ గో ప్లస్ ఎన్ని మార్కులు తెచ్చుకుందో తెలుసుకునేందుకు ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి.

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి టెస్ట్ డ్రైవ్ రివ్యూ


డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి బాడీని జపాన్‌లో డిజైన్ చేశారు. అయితే, ఈ కారును మాత్రం పూర్తిగా ఇండియాలోనే అభివృద్ధి చేసి, తయారు చేశారు. గో ప్లస్ ఓ సబ్-ఫోర్ మీటర్ 7-సీటర్ (2+3+2) ఎమ్‌పివి. ఈ మోడల్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి, తక్కువ ధరకే (రూ.5 లక్షల లోపే) అందించేందుకు వీలుగా గో హ్యాచ్‌బ్యాక్ మోడల్‌కు కొద్దిపాటి మార్పులు చేసి ఈ గో ప్లస్ ఎమ్‌పివిని తయారు చేశారు. అందుకే, ఈ రెండు మోడళ్లలో అనేక ఫీచర్లు ఒకేలా ఉంటాయి.

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే లభ్యం కానున్నట్లు సమాచారం. డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించిన 1.2 లీటర్ (1198సీసీ), 3-సిలిండర్, పెట్రోల్ ఇంజన్‌నే ఈ డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివిలోను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5000 ఆర్‌పిఎమ్ వద్ద 68 పిస్‌ల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 104 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 14.5 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుటుందని కంపెనీ తెలిపింది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. ఈ ఎమ్‌పివికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Datsun will launch the Go+ MPV on 15th January 2015. The Datsun Go+ will be the India's first sub-4 metre MPV. Stay tuned for latest updates.
Story first published: Monday, December 22, 2014, 17:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X