మే 9న మార్కెట్లోకి రానున్న చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

By Ravi

జనరల్ మోటార్స్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'చెవర్లే ఎంజాయ్' ఎమ్‌పివి విడుదలకు ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, జిఎమ్ ఇండియా తమ చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివిని వచ్చే నెల 9న మార్కెట్లో విడుదల చేయనుంది. ఇప్పటికే అధికారిక ఫొటోలను విడుదల చేసిన జనరల్ మోటార్స్ ఈ ఎమ్‌పివి విడుదల రోజున ధర, ఇతర సాంకేతిక వివరాలను వెల్లడించనుంది. గుజరాత్‌లోని తమ హలోల్ ప్లాంటులో కంపెనీ ఈ ఎమ్‌పివిని ఉత్పత్తి చేస్తుంది.

ఈ సెగ్మెంట్లో టొయోటా ఇన్నోవా, మారుతి సుజుకి ఎర్టిగా, మహీంద్రా జైలో, నిస్సాన్ ఇవాలియా వంటి ఎమ్‌పివిలకు గట్టి సవాల్ విసురుతూ చెవర్లే ఎంజాయ్ మే 9, 2013న మార్కెట్లోకి రానుంది. జనరల్ మోటార్స్ తొలిసారిగా ఈ ఎమ్‌పివిని గడచిన సంవత్సరం ఢిల్లీలో జరిగిన 11ల అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పో ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. చెవర్లే ఎంజాయ్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

పెట్రోల్ వెర్షన్‌లో 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 93 బిహెచ్‌పిల శక్తిని, 127 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేయనుంది. అలాగే, డీజిల్ వెర్షన్‌లో ఫియట్ నుంచి గ్రహించిన 1.3 లీటర్ మల్టీజెట్ ఇంజన్‌‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 88 బిహెచ్‌పిల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ రెండు వెర్షన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభ్యం కానున్నాయి. తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

Most Read Articles

English summary
According to sources, Genral Motors India is expected to launch the much awaited Chevrolet Enjoy MPV on May 9, 2013. Chevrolet Enjoy will be Chevrolet's 1st MPV for India. Stay tuned to Telugu Drivespark for more updates.
Story first published: Friday, April 26, 2013, 13:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X