జనవరి 7న బెంగుళూరులో విడుదల కానున్న మహీంద్రా గస్టో

By Super Admin

మహీంద్రా గ్రూపుకు చెందిన ద్విచక్ర వాహన విభాగం మహీంద్రా టూవీలర్స్, గడచిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో దేశీయ మార్కెట్లో విడుదల చేసిన మహీంద్రా గస్టో (Mahindra Gusto) ఆటోమేటిక్ స్కూటర్‌ను ఈ నెల 7వ తేదీన బెంగుళూరు మార్కెట్లో విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకూ పశ్చిమ, ఉత్తర భారతదేశ మార్కెట్లలో మాత్రమే లభిస్తున్న గస్టో స్కూటర్, ఇకపై దక్షిణ భారతదేశంలో కూడా లభ్యం కానుంది.

ఈ జనవరి నాటికి భారతదేశంలో అన్ని ఇతర మార్కెట్లలోను గస్టో స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని కంపెనీ గతంలో పేర్కొన్న సంగతి తెలిసినదే. ఇందులో భాగంగానే, మహీంద్రా గస్టో స్కూటర్‌ను జనవరి 7, 2015వ తేదీన బెంగుళూరు మార్కెట్లో విడుదల చేయనున్నారు. మహీంద్రా గస్టో స్కూటర్ ఓ గ్లోబల్ స్కూటర్. ఇది కేవలం ఇండియన్ మార్కెట్లోనే కాకుండా సౌత్ ఏషియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా వంటి ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విడుదల కానుంది.

ఇది కూడా చదవండి: మహీంద్రా గస్టో టెస్ట్ రైడ్ రివ్యూ


మహీంద్రా గస్టో స్కూటర్‌ను అధునాతన ఇంజనీరింగ్ ఫీచర్లతో ఇటలీలో అభివృద్ధి చేశారు. మహీంద్రా గస్టో స్కూటర్‌లో అధునాతన ఎమ్-టెక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇందులోని 109.6సీసీ, 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.0 బిహెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఇందులో ముందు వైపు టెలిస్కోపిక్, వెనుక వైపు హైడ్రాలిక్ సస్పెన్షన్‌ను ఉపయగించారు. దక్షిణ భారతదేశంలో ఇది జవరి నుంచి అందుబాటులో ఉంటుందని మహీంద్రా టూవీలర్స్ పేర్కొంది. ఇది మొత్తం ఆరు రంగులలో (ఐస్‌బర్గ్ వైట్, గలాక్టిక్ బ్లాక్, మాగ్నటిక్ మాగ్నెటా, వొల్కానో రెడ్, ఆర్కిటిక్ వైట్, రావెన్ బ్లాక్) లభిస్తుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Mahindra Two Wheelers Limited will launch its indigenously developed scooter, 'GUSTO', in Bengaluru on Jan 7th. Stay tuned for latest updates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X