భారత టూవీలర్ మార్కెట్లోకి యూఎమ్ గ్లోబల్ బైక్స్!

భారత మార్కెట్లో మరో విదేశీ ద్విచక్ర కంపెనీ ప్రవేశించనుంది. భారత్‌లో మోటార్‌సైకిళ్ల మంచి గిరాకీ ఏర్పడుతున్న నేపథ్యంలో, ఈ సెగ్మెంట్లోని అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు ఫారిన్ బైక్ కంపెనీలు ఇండియాకు క్యూ కడుతున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా మియామీ దేశానికి చెందిన 'యూఎమ్ గ్లోబల్' (UM Global) అనే మోటార్‌సైకిల్ తయారీ కంపెనీ వచ్చి చేరనుంది.

Advertisement

యూఎమ్ గ్లోబల్ తమ భారతీయ అనుబంద సంస్థ 'యూఎమ్ మోటార్‌సైకిల్స్' (UM Motorcycles) ద్వారా ఇండియాలోకి ప్రవేశించనుంది. ఫిబ్రవరి 5, 2014వ తేది నుంచి ప్రారంభం 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో యూఎమ్ మోటార్‌సైకిల్స్ తమ ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. ఇందులో 100సీసీ నుంచి 250సీసీ వరకు ఇంజన్ సామర్థ్యం కలిగిన స్పోర్ట్స్ బైక్స్, క్రూయిజర్స్, డ్యూయెల్ పర్పస్ బైక్స్ మరియు స్కూటర్లు ఉండనున్నాయి.

Advertisement

అమెరికాకు చెందిన ఈ యూఎమ్ (యునైటెడ్ మోటార్స్) మోటార్‌సైకిల్ కంపెనీ ఢిల్లీలో తమ కార్పోరేట్ ఆఫీసును ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అంతేకాకుండా, ఈ సంస్థ ఓ తయారీ/అసెంబ్లింగ్ ప్లాంట్‌ను మరియు ఓ ఆర్ అండ్ డి కేంద్రాన్ని కూడా భారత్‌లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలను క్రింది, కంపెనీ ఆఫర్ చేయనున్న ఉత్పత్తుల వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఇది యూఎమ్ గ్లోబల్ అందిస్తున్న స్కూటర్ 'జిపి1'. ఈ స్కూటర్ 125సీసీ, 150సీసీ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.

ఇది యూఎమ్ గ్లోబల్ అందిస్తున్న స్పోర్ట్స్ బైక్ 'ఫాస్ట్‌విండ్'. ఇది 175సీసీ, 200సీసీ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.

ఇది యూఎమ్ అందిస్తున్న క్రూయిజర్ బైక్ 'రెనెగేడ్'. ఇది కూడా 175సీసీ, 200సీసీ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.

ఇది యూఎమ్ అందిస్తున్న డ్యూయెల్ పర్సప్ బైక్ 'డిఎస్ఆర్-2'. ఇది 125సీసీ, 200సీసీ మరియు 225సీసీ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.

TRENDING

English Summary

Another US motorcycle brand is ready to hit the Indian shores. Miami-based motorcycle manufacturer, UM Global, will mark its official entry into the Indian motorcycle market at the Delhi Auto Expo 2014 through its Indian subsidiary, UM Motorcycles.
Advertisement