డెట్రాయిట్ ఆటో షోలో మాసేరటి కుబాంగ్ ఎస్‌యూవీ
ఆకర్షనీయమైన స్టయిల్, శక్తివంతమైన ఇంజన్, మెరుగైన సస్పెన్షన్, పవర్‌ఫుల్ బ్రేక్స్, సౌకర్యవంతమైన రైడింగ్ అండ్ హ్యాండ్లింగ్, విలాసవంతమైన ఇంటీరియర్స్, ఆకట్టుకునే ఎక్స్టీరియర్స్, పెర్ఫామెన్స్‌ల విషయంలో తమ కుబాంగ్ ఎస్‌యూవీ మెరుగ్గా రాణిస్తుందని, అత్యంత స్పోర్టీ లుక్‌తో విలాసవంతమైన ప్రయాణాన్ని కోరుకునే వారి కోసం దీన్ని డిజైన్ చేశామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇది అత్యంత శక్తివంతమైన ఇంజన్‌తో 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుందని కంపెనీ తెలిపింది. అంతకు మించి వివరాలను కంపెనీ వెల్లడించేందుకు కంపెనీ నిరాకరించింది. కాగా.. తాజాగా ముగిసిన 11వ అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పో మాత్రం మాసేరటి కుబాంగ్ ఎస్‌యూవీ దర్శనానికి నోచుకోలేదు.


Click it and Unblock the Notifications








