2013 సెమా షో హైలైట్స్; హాట్ కార్స్ అండ్ బూత్ గర్ల్స్
అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మోటార్ షోలలో 'సెమా' (స్పెషాలిటీ ఎక్విప్‌మెంట్ మార్కెట్ అసోషియేషన్) షో కూడా ఒకటి. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా 2013వ ఎడిషన్ సెమా ఆటో షోను నవంబర్ నెల మొదటి వారంలో నిర్వహించారు. ఈ షో నవంబర్ 5, 2013వ తేదీన అమెరికాలోని లాస్ వేగాస్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభమై నవంబర్ 7, 2013న ముగిసింది.
ఇవి కూడా చూడండి.. 2012 సెమా ఆటో షో బూత్ గర్ల్స్
ఈ సుప్రసిద్ధ ఆటో షోలో దేశ విదేశాలకు చెందిన అనేక మంది తయారీదారులు తమ అధునాత ఉత్పత్తులను, సాంకేతికతలను ప్రదర్శనకు ఉంచారు. సెమా షో ప్రపంచంలోనే ఓ ప్రీమియర్ ఆటోమోటివ్ స్పెషాలిటీ ప్రోడక్ట్స్ ట్రేడ్ ఈవెంట్. ఈ మోటార్ షో పరిశ్రమలోని అత్యుత్తమ ఉత్పత్తులను, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ఒక వేదికపైకి చేర్చుతుంది.
ఎప్పటిలాగే ఈ 2013 సెమా ఆటో షోలో అందమైన భామలు, ఆకట్టుకునే కార్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మరి ఆ అందాలను మనం కూడా తిలకిద్దాం రండి..!

స్పెషాలిటీ ఎక్విప్‌మెంట్ మార్కెట్ అసోషియేషన్ (సెమా) ఆటో షో గురించి కొన్ని ఆసక్తికర విషయాలను మనం ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

2013 సెమా షో ఈనెల 5వ తేదీన అమెరికాలోని లాస్ వేగాస్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభమై నవంబర్ 7, 2013న ముగిసింది.

తాజాగా జరిగిన 2013 సెమా షోలో 2400 లకు పైగా ప్రపచం స్థాయి కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. ఇందులో 500 కొత్త బ్రాండ్ ఎగ్జిబిటర్లు కూడా ఉన్నారు.

సెమా షో యొక్క న్యూ ప్రోడక్ట్ షోకేస్‌లో ప్రముఖ తయారీదారుల నుంచి 2400 లకు పైగా సరికొత్త ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. ఈ షోలో ప్రముఖ పారిశ్రామిక నిపుణుల ఆధ్వర్యంలో 50కి పైగా ఉచిత, వాణిజ్య నిర్మాణ విద్యా సెషన్లను కూడా నిర్వహించారు.

ఆటోమొబైల్ ఆఫ్టర్ మార్కెట్ అయిన స్పెషాలిటీ ఎక్విప్‌మెంట్ మార్కెట్ అసోషియేషన్ (సెమా)ను 1963వ సంవత్సరంలో రాయ్ రిచర్, ఎడ్ ఇస్కెండిరియన్, విల్లీ గార్నర్, బాబ్ హెడ్‌మ్యాన్, రాబర్ట్ ఈ వైమ్యాన్, జాన్ బార్ట్లెట్, ఫిల్ వీయాండ్, జూ. ఆల్ సెగల్, డియాన్ మూన్, విక్ ఎడెల్‌బ్రాక్ తదితరులు కలిసి స్థాపించారు.

ప్రస్తుతం సెమా ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా 6,383 లకు పైగా కంపెనీలున్నాయి.

వీటిలో ఆఫ్టర్ మార్కెట్ మ్యానుఫాక్చరర్స్, ఒరిజనల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫాక్చరర్స్, మీడియా, కార్ డీలర్స్, స్పెషాలిటీ ఎక్విప్‌మెంట్ డిస్ట్రిబ్యూటర్స్, ఇన్‌స్టాలర్స్, రీటైరల్స్, రిలేషన్‌షిప్ స్పెషలిస్ట్ తదితర విభాగాలకు చెందినవి ఉన్నాయి.

అంతేకాకుండా, ఇందులో పెర్ఫామెన్స్ అండ్ రేసింగ్ కాంపోనెంట్స్, కాస్మోటిక్ అండ్ ఫంక్షనల్ యాక్ససరీస్, వీల్స్ అండ్ టైర్స్, మొబైల్ ఎలక్ట్రానిక్స్, సేఫ్టీ ప్రోడక్ట్స్, రిస్టొరేషన్ పార్ట్స్, హ్యాండ్లింగ్ ఎక్విప్‌మెంట్, డ్రైవ్‌ట్రైన్ పార్ట్ వంటివి అనేకం ఉన్నాయి.

ఈ షోలో ప్రధానంగా మజిల్ కార్స్, సూపర్ కార్స్, క్లాసిక్ కార్స్, లగ్జరీ వాహనాలు, స్పోర్ట్ కాంపాక్ట్స్, స్ట్రీట్ రాడ్స్, లైట్ ట్రక్స్ (ఆఫ్-రోడింగ్, స్పోర్ట్ ట్రక్స్), ఎస్‌యూవీలు మరియు రిక్రియేషనల్ వెహికల్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటాయి.

సెమా ఆధ్వర్యంలోని కార్ కంపెనీలన్నీ ప్రతి ఏటా జరిగే అంతర్జాతీయ మోటార్ షోలో తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచుంతుంటాయి.

సెమా తమ సభ్య కంపెనీల యొక్క ఉద్యోగులకు విద్యా, వృత్తి నైపుణ్యం, మార్కెట్ అధ్యయనం, న్యాయపరమైన మరియు నియంత్రణ సలహాలు, పరిశ్రమ ప్రచురణలు, అంతర్తాయీ వ్యాపారాభివృద్ధి, వాణిజ్య కార్యకలాపాలు మొదలైన సేవలను అందిస్తుంది.

సెమా కార్యక్రమాలలో కెల్లా అతిపెద్ద కార్యక్రమమైన 'సెమా షో' ప్రతి ఏటా నవంబర్ నెల మొదటి వారంలో లాస్ వేగాస్‌లోని కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తారు.

'సెమా షో'ను ఆటోమోటివ్ ఆఫ్టర్‌మార్కెట్ ఇండస్ట్రీ వీక్ సహకారంతో సెమా నిర్వహిస్తుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా, సెమాతో పాటుగా ఇతర ఆటోమోటివ్ ఆఫ్టర్‌మార్కెట్ ట్రేడ్ గ్రూప్స్ అన్ని తమ లాస్ వేగాస్ క్యాలెండర్‌లో ఈ తేదీని ప్రత్యేకంగా గుర్తుంచుకుంటాయి.

అయితే, ఇతర ఆటో షోల మాదిరిగా ఈ సెమా ఆటో షో సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంది. కేవలం తయారీదారులు, వర్తకులు, కొనుగోలుదారులు, ఎగ్జిబిటర్స్ మరియు మీడియా ప్రతినిధులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది.

వాస్తవానికి, మొదట్లో సెమా (SEMA) అంటే స్పీడ్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫాక్చరింగ్ అసోషియేషన్ అని అర్థం. అయితే, 1970లో ప్రభుత్వ నియంత్రణ సంస్థ సదరు పేరుపై అభ్యంతరం వ్యక్తం చేయటంతో దీనిని స్పెషాలిటీ ఎక్విప్‌మెంట్ మార్కెట్ అసోషియేషన్‌గా మార్చారు.

సెమా అవార్డ్స్..
గడచిన 2003 నుంచి జిటి అవార్డ్ పేరిట సెమా ఆటో కన్వెన్షన్ వద్ద వివిధ విభాగాల్లో అవార్డులు ప్రధానం చేయటం జరుగుతుంది. బెస్ట్ ఇన్ షో, బెస్ట్ హాట్ రాడ్, బెస్ట్ యూరోపియన్ ఇంపోర్ట్ తదితర విభాగాల్లో ఈ అవార్డులను ఇవ్వటం జరుగుతుంది.

మొబైల్ అప్లికేషన్
గతంలో సెమా షో వచ్చే కొనుగోలుదారులు, ఇతరులు ప్రింటెడ్ పాకెడ్ గైడ్ ద్వారా సెమా షోలోని బూత్‌లను, ఎగ్జిబిట్లను సందర్శించే వారు. అయితే, ఈ విధానానికి చెక్ పెడుతూ, సెమా బృందం స్మార్ట్ ఫోన్ల కోసం ఓ మొబైల్ అప్లికేషన్‌ను విడుదల చేసింది.

కాగా.. వచ్చే ఏడాది జరగనున్న సెమా షో తేదీలు కూడా ఇప్పటికే ఖరారయ్యాయి. నవంబర్ 4, 2014వ తేదీ నుంచి నవంబర్ 7, 2014వ తేదీలలో అదే లాస్ వేగాస్ కన్వెన్షన్ సెంటర్లో ఈ పాపులర్ ఆటో షో జరగనుంది.

ఈ 2013 ఎడిషన్ సెమా షోలో కస్టమైజ్డ్ రోల్స్ రాయిస్ నుంచి శక్తివంతమైన ఆడి ఆర్8 జిటి3 కారు వరకు ప్రదర్శనకు ఉంచారు. ఈ ఫొటోలో మీరు చూస్తున్నది కస్టమైజ్డ్ రోల్స్ రాయిస్ కారు.

ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సెమా షోలో బూత్ గర్ల్స్ (స్టాల్స్ వద్ద నిలిచి ఉండే మోడల్స్) సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.

తాజాగా ముగిసిన 2013 సెమా షోలో లాంబోర్గినీ కార్లు షోను దోచేశాయి. ఎక్కడ చూసినా లాంబోర్గినీ అవెంటేడర్ కార్లు కనిపించాయి.

అంతేకాకుండా.. ఈ షోలో కస్టమైజ్డ్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ కార్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

2013 సెమా షోలో తళుక్కుమన్న మెర్సిడెస్ బెంజ్ కారు.

2013వ ఎడిషన్ సెమా షోలో మీడియా ఫొటోలకు ఫోజులిస్తున్న బూత్ గర్ల్స్.

ప్రముఖ అంతర్జాతీయ టైర్ల తయారీ సంస్థ పీరెలీ తమ టైర్లను ప్రదర్శనకు ఉంచింది.

2013 సెమా షోలోని ఓస్టాల్‌లో నిలుచుకొని ఉన్న అందమైన బూత్ గర్ల్.

ఇటీవల ముగిసిన 2013 సెమా షోలో పురాతన క్లాసిక్ కార్లు చూపరుల మనసు దోచుకున్నాయి. అందులో ఓ క్లాసిక్ కారే ఇది.

2013 సెమా షో బూత్ గర్ల్.

ఇటీవల ముగిసిన 2013 సెమా షోలో పురాతన క్లాసిక్ కార్లు చూపరుల మనసు దోచుకున్నాయి. ఇదోరకం క్లాసిక్ కారు.

2013 సెమా ఆటో షోలో అందాలు ఆరబోస్తున్న హాట్ బూత్ గర్ల్స్.

ఇటీవల ముగిసిన 2013 సెమా షోలో పురాతన క్లాసిక్ కార్లు చూపరుల మనసు దోచుకున్నాయి. అందులో ఓ క్లాసిక్ కారే ఇది.

ఓ సూపర్ కార్ స్టాల్‌లో నిలుచుకొని ఫొటోలకు ఫోజిస్తున్న అమెరికన్ అమ్మడు.

2013 సెమా షోలో రెగ్యులర్ కార్ల కన్నా హై పెర్ఫామెన్స్ కార్లు, వాహనాలే ఎక్కువగా కనిపించాయి.

ఈ షోలో అమెరికన్ మోడల్స్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలించారు.

ఇటీవల ముగిసిన 2013 సెమా షోలో పురాతన క్లాసిక్ కార్లు చూపరుల మనసు దోచుకున్నాయి.

ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న బూత్ గర్ల్స్.

ఇటీవల ముగిసిన 2013 సెమా షోలో కండలు తిరిగిన కార్లు ప్రత్యేకంగా నిలిచాయి.

ఇటీవల ముగిసిన 2013 సెమా షోలో పురాతన క్లాసిక్ కార్లు చూపరుల మనసు దోచుకున్నాయి. అందులో ఓ క్లాసిక్ కారే ఇది.

ఇవీ ఈ ఏడాది 2013 సెమా షో హైలైట్స్. లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.
ఫొటో మూలం: జిటి స్పిరిట్ , ఇంపోర్ట్ ట్యూనర్


Click it and Unblock the Notifications








