జాగ్వార్ సి-ఎక్స్17 కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫొటో లీక్

By Ravi

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ తొలిసారిగా ఓ ఎస్‌యూవీని తయారు చేస్తున్నట్లు ఇప్పటికే మనం పలు కథనాల్లో తెలుసుకున్నాం. ఈనె0 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో జాగ్వారా తమ జాగ్వార్ సి-ఎక్స్17 కాంపాక్ట్ ఎస్‌యూవీని అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ మేరకు ఓ టీజర్ ఫొటోను కూడా కంపెనీ విడుదల చేసింది.

అయితే, ఈలోపుగానే జాగ్వార్ సి-ఎక్స్17 కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన ఫ్రంట్ ప్రొఫైల్ ఒకటి ఇంటర్నెట్‌లో లీక్ అయింది. పెద్ద హనీకోంబ్ ఫ్రంట్ గ్రిల్, గ్రిల్‌ చుట్టూ క్రోమ్ ఫినిషింగ్, హనీకోంబ్ ఎయిర్ ఇన్‌టేక్స్, ఎయిర్ ఇన్‌టేక్స్ చుట్టూ బోల్డ్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్, ఎల్ఈడి హెడ్‌లైట్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, మిర్రర్లపై ఎల్ఈడి ఇండికేటర్స్, స్పోర్టీ సీట్స్ వంటి అనేక కొత్త అంశాలను జాగ్వార్ సి-ఎక్స్17 కాన్సెప్ట్‌లో చూడొచ్చు.

ఇది కాన్సెప్ట్ వెర్షన్ కాబట్టి, ప్రొడక్షన్ దశకు చేరుకునే వెర్షన్‌లో ఇందులోని కొన్ని ఫీచర్లు కోల్పోయే ఆస్కారం ఉంది. ఇది ల్యాండ్ రోవర్ అందిస్తున్న ఆఫ్-రోడింగ్ ఎస్‌యూవీల మాదిరిగా కాకుండా ఎవోక్ వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీ మాదిరిగా ఉంటుందని అని తెలుస్తోంది. ప్రత్యేకించి అర్బన్ రోడ్ల కోసం తయారు చేసిన మోడల్‌గా అనిపిస్తుంది.

Jaguar C X17

జాగ్వార్ సి-ఎక్స్17 కాంపాక్ట్ ఎస్‌యూవీని ఫ్లెక్సిబల్ మరియు అత్యంత అధునాతనమైన మాడ్యులర్ అల్యూమినియం ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో జాగ్వార్ నుంచి రానున్న ఇతర అన్ని నెక్స్-జెన్ ఎస్‌యూవీలకు ఇదే ప్లాట్‌ఫామ్‌ను వినియోగించనున్నారు. 2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షో సి-ఎక్స్17 కాన్సెప్ట్ కారుతో పాటుగా జాగ్వార్ మరికొన్ని కొత్తగా పరిచయం చేసిన ప్రొడక్షన్ మోడళ్లను కూడా ప్రదర్శనకు ఉంచనుంది.

వీటిలో ప్రధానంగా, ఇటీవలే విడుదల చేసిన ఆర్ పెర్ఫామెన్స్ మోడళ్లు ఎక్స్‌‌జేఆర్, ఎక్స్ఎఫ్ఆర్-ఎస్‌లతో పాటుగా ఎక్స్ఎఫ్ స్పోర్ట్‌బ్రేక్, అత్యంత పాపులర్ అయిన ఫై-టైప్ మోడళ్లు కూడా ఉండనున్నాయి. జాగ్వార్ సి-ఎక్స్17 కాన్సెప్ట్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, September 6, 2013, 14:49 [IST]
English summary
Earlier this week Jaguar decided to share the news about the launch with a teaser image and a few words about the platform that underpins the new vehicle. But thanks to some enterprising internet users the face of the C-X17 concept has been revealed.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+