జాగ్వార్ ఎస్‌యూవీ టీజర్; ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో ఆవిష్కరణ

By Ravi

లగ్జరీ సెడాన్లు, స్పోర్ట్స్ కార్ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ తొలిసారిగా ఓ ఎస్‌యూవీని తయారు చేయనున్నట్లు గడచిన నెలల్లో పలు కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజాగా, ఈనెల రెండవ వారంలో జరగనున్న 2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోను పురస్కరించుకొని, జాగ్వార్ తమ తొలి ఎస్‌యూవీకి సంబంధించి ఓ టీజర్ ఫొటోను విడుదల చేసింది.

ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో జాగ్వార్ ఆవిష్కరించనున్న ఈ కాన్సెప్ట్ ఎస్‌యూవీ పేరును సి-ఎక్స్17 (Jaguar C-X17) అని పిలువనున్నారు. భవిష్యత్తులో జాగ్వార్ నుంచి రానున్న ఎస్‌యూవీ టైప్ ఉత్పత్తుల కోసం ఈ అత్యంత అధునాతనమైన మాడ్యులర్ అల్యూమినియం ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించనున్నారు. సి-ఎక్స్17 కాన్సెప్ట్ కారుతో పాటుగా జాగ్వార్ మరికొన్ని కొత్తగా పరిచయం చేసిన ప్రొడక్షన్ మోడళ్లను కూడా ఈ మోటార్ షోలో ప్రదర్శనకు ఉంచనుంది.

Jaguar C X17

వీటిలో ప్రధానంగా, ఇటీవలే విడుదల చేసిన ఆర్ పెర్ఫామెన్స్ మోడళ్లు ఎక్స్‌‌జేఆర్, ఎక్స్ఎఫ్ఆర్-ఎస్‌లతో పాటుగా ఎక్స్ఎఫ్ స్పోర్ట్‌బ్రేక్, అత్యంత పాపులర్ అయిన ఫై-టైప్ మోడళ్లు కూడా ఉండనున్నాయి. జాగ్వార్ సి-ఎక్స్17 కాన్సెప్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే సెప్టెంబర్ 10 వరకు ఆగాల్సిందే.

భారత ఆటో దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న ఈ జాగ్వార్ బ్రాండ్ ఇప్పటి వరకు పెర్ఫామెన్స్ సెడాన్లను, స్పోర్ట్స్ కార్ల తయారీలో ఓ ప్రత్యేకమైన గ్లోబల్ ఐడెంటెటీని సొంతం చేసుకుంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీలో జాగ్వార్ బ్రాండ్ క్రింద సెడాన్లు, స్పోర్ట్స్ కార్లను అలాగే ల్యాండ్ రోవర్ బ్రాండ్ క్రింద పవర్‌ఫుల్ ఎస్‌యూవీలను, ఆఫ్-రోడింగ్ వాహనాలను తయారు చేస్తూ వచ్చారు. కాగా, తొలిసారిగా పాపులర్ జాగ్వార్ బ్రాండ్ క్రింద ఎస్‌యూవీని తయారు చేయాలని కంపెనీ ప్రతిపాదించడంతో ఈ కొత్త మోడల్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

More from DriveSpark

Article Published On: Monday, September 2, 2013, 13:34 [IST]
English summary
Last month Jaguar revealed its plan to launch an SUV product of its own. Today, the UK based automaker has released a teaser image of a concept vehicle, C-X17 that will be on display at the Frankfurt Auto Show in IAA starting from September 10th.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+